మ‌హేశ్ బాబు మ‌హ‌ర్షి టీజ‌ర్ డేట్ ఫిక్స్‌

1018
Mahesh babu maharshi teaser date loced
Mahesh babu maharshi teaser date loced

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు తాజాగా హీరోగా న‌టిస్తున్న చిత్రం మ‌హ‌ర్షి. ఈ సినిమాకు వంశీపైడిప‌ల్లి ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా దిల్ రాజు పీవీపీ , అశ్వినీద‌త్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మ‌హేశ్ కెరీర్‌లో 25వ సినిమా కావ‌డంతో చాలా ప్ర‌తీష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. మ‌హ‌ర్షి సినిమాలో మ‌హేశ్‌కు జోడిగా పూజా హెగ్డె న‌టిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన బ‌ర్త్ డే టీజ‌ర్ , పోస్ట‌ర్స్‌కు విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చింది. రెండు పాటల మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తైంది. ఏప్రిల్ రెండవ వారంలో ఈ పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు.

తాజాగా ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్‌. తెలుగు వారి పండుగ అయిన ఉగాదినాడు ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యార‌ట‌. దీనికి సంబంధించిన సీన్ల‌ను క‌ట్ చేసే ప‌నిలో ప‌డ్డార‌ట నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. వ‌చ్చే మే 9న విడుద‌ల ఈ సినిమాను విడుద‌ల చేశారు. ఇక ఈ సినిమాలో అల్ల‌రి న‌రేశ్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించున్నాడు. ఈ సినిమా కోసం మ‌హేశ్ బాబు ఫ‌స్ట్ టైం ఫుల్ గెడ్డం మీసాంతో ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నాడు.