Friday, March 29, 2024
- Advertisement -

మ‌హేశ్ బాబు ‘మ‌హర్షి’ టీజ‌ర్‌

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఫ్యాన్స్‌కు రెండు పండుగ‌లు ఒకే రోజు వ‌చ్చాయి. మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన ‘మ‌హర్షి’ సినిమా టీజ‌ర్‌ను ఈ రోజు విడుద‌ల చేశారు. ఉగాది పండుగ సంద‌ర్భంగా మ‌హ‌ర్షి టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు చిత్ర యూనిట్‌. టీజర్ చూసిన మహేష్ అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఇందులో మహేష్ స్టైలిష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.సక్సెస్‌లో ఫుల్ స్టాప్స్ ఉండవ్, కామాస్ మాత్రమే ఉంటాయ్, సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ అంటూ మ‌హేశ్ బాబు చెప్పే డైలాగ్ టీజ‌ర్‌కే హైలేట్‌గా నిలిచింది. టీజ‌ర్‌లో మ‌హేశ్‌ను త‌ప్ప మ‌రో క్యారెక్ట‌ర్‌ను చూపించ‌లేదు.

మ‌హ‌ర్షిలో హీరోయిన్‌గా పూజా హెగ్డె న‌టిస్తుండ‌గా, అల్ల‌రి న‌రేశ్ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా మ‌హేశ్ బాబు కెరీర్‌లో 25వ సినిమా కావ‌డం విశేషం. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను అశ్వనీదత్, పివిపి, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌హ‌ర్షి సినిమా మ‌హేశ్ బాబు కెరీర్‌లో 25వ సినిమా కావ‌డంతో సినిమాను చాలా ప్ర‌తీష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మ‌హేశ్ ఫ‌స్ట్ టైమ్ గెడ్డం, మీసాం పెంచాడు. ఇక సినిమా ను మే నెల 9న విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -