Saturday, April 20, 2024
- Advertisement -

సరి కొత్త లుక్ తో మహేష్ బాబు

- Advertisement -

‘మహర్షి’ సినిమాతో హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో 26వ సినిమా పైన దృష్టి పెట్టాడు. సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవబోతోంది. ప్రస్తుతం బాబు ఈ సినిమాలో మహేష్ బాబు కాస్ట్యూమ్స్ ను ఫైనలైజ్ చేయడంలో బిజీగా ఉన్నారు అనిల్ రావిపూడి. దగ్గరుండి మరీ మహేష్ బాబు కాస్ట్యూమ్స్ ను అనిల్ రావిపూడి డిసైడ్ చేస్తున్నారని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబును ఈ సినిమాలో ఒక సరికొత్త లుక్తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అని తెలుస్తోంది. అనిల్ సుంకర మరియు దిల్ రాజు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ సినిమాకి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందించబోతున్నారు. మహర్షి సినిమా విడుదలైన రోజే మిక్స్డ్ రెస్పాన్స్ అందుకోవడంతో అభిమానులు కూడా నిరాశ చెందారు. కానీ మహేష్ బాబు ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -