Friday, April 19, 2024
- Advertisement -

ఆర్మీ ఆఫీస‌ర్‌గా మ‌హేశ్ బాబు..?

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉన్నాడు. మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో మ‌హేశ్‌కు జోడీగా పూజా హెగ్డె న‌టిస్తోంది. మ‌హ‌ర్షి సినిమా మ‌హేశ్ బాబు కెరీర్‌లో 25వ సినిమా కావ‌డంతో చాలా ప్ర‌తీష్టాత్మ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను వ‌చ్చే నెల 9న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా త‌రువాత వెంట‌నే మ‌రో సినిమా మొద‌లుపెట్ట‌నున్నాడు మొద‌ట సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ ఓ సినిమా చేయాల్సి ఉంది.

కాని క‌థ సెట్ కాక‌పోవ‌డంతో లైన్లోకి ఎఫ్ -2 ద‌ర్శకుడు అనిల్ రావిపూడి వ‌చ్చాడు. మ‌హేశ్ కోసం అనిల్ రావిపూడి ఓ క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలో మ‌హేశ్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేశ్ పోలీస్‌గా క‌నిపించాడు. పోకిరి, దూకుడు, ఆగ‌డు సినిమాల్లో మ‌హేశ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించాడు. కాని ఫ‌స్ట్ టైమ్ మ‌హేశ్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. సినిమా మ‌హేశ్ స్టైల్‌తో పాటు అనిల్ రావిపూడి స్టైల్లో కూడా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతానికి అయితే మ‌హేశ్ కోసం క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట అనిల్ రావిపూడి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -