Saturday, April 20, 2024
- Advertisement -

సుకుమార్‌తో సినిమా క్యాన్సిల్ చేసుకున్న మ‌హేశ్ బాబు

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా వివిధ కార‌ణాల వ‌ల్ల క్యాన్సిల్ అయింది. ఈ విష‌యాన్ని మ‌హేశ్ బాబే స్యయంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. క‌థ సెట్ కాక‌పోవ‌డంతో త‌మ సినిమా క్యాన్సిల్ అయింద‌ని తెలిపాడు మ‌హేశ్ బాబు. సుకుమార్‌తో నేను చేసిన 1 నేనొక్కిడినే సినిమా క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా చేసే స‌మ‌యంలో నేను సినిమాను బాగా ఆస్వాదించాన‌ని, మీరు తీయ‌బోయే కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్ స‌ర్ అంటూ ట్విట్ చేశాడు మ‌హేశ్‌.

సుకుమార్ ,మ‌హేశ్ బాబు కాంబినేష‌న్‌లో సినిమా క్యాన్సిల్ కావ‌డంపై ఆయ‌న అభిమానులు తీవ్ర అంస‌తృప్తిలో ఉన్నారు. ఇక మ‌హేశ్ బాబుతో సినిమా క్యాన్సిల్ అవ్వ‌డంతో బ‌న్నితో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు సుకుమార్. దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. బ‌న్ని ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వ‌గానే సుకుమార్‌తో సినిమా చేస్తాడు బ‌న్ని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -