ఫ్లాప్ సినిమాపై కామెంట్ చేసిన మ‌హేశ్

444
Mahesh babu tweet about rajinikanth movie
Mahesh babu tweet about rajinikanth movie

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు అన్న సంగ‌తి తెలిసిందే. ప‌లు హీరోల సినిమాలు చూసి ట్విట్ చేస్తుంటాడు మ‌హేశ్‌. తాజాగా ఇలాగే ఓ సినిమాపై ట్విట్ చేశాడు మ‌హేశ్ బాబు. ఇందులో కొత్త ఏమి లేదు కాని , ప్లాప్ అయిన సినిమాపై మ‌హేశ్ కామెంట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన పేటా మూవి నిన్ననే(బుధ‌వారం) విడుద‌లైంది.

ఈ సినిమాను త‌మిళ‌, తెలుగు భాష‌ల‌లో విడుద‌ల చేశారు. ఈ సినిమా రెండు భాష‌ల‌లో ఫెయిల్ అయింది. క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం, బాష సినిమాను పోలి ఉండంటంతో సినిమా ఫెయిల్ అయింది.మ‌రి ఫెయిల్ అయిన సినిమాపై మ‌హేశ్ ఎలా కామెంట్ చేశాడ‌ని భావిస్తున్నారు. అయితే మ‌హేశ్‌కు సినిమా నచ్చి ఉండ‌వచ్చు. ఇక పేటాతో పాటు విడుద‌లైన అజిత్ విశ్వాసం సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చింది.