Wednesday, April 24, 2024
- Advertisement -

మరీ టూ మచ్ చేస్తున్న మహేష్ బాబు

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే మహర్షి సినిమా తో పెద్ద విజయం సాధించిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చిన విషయం వాస్తవం. కానీ సినిమా యూనిట్ మంచి అలర్ట్ గా ఉంటూ ఎక్కువ గా ప్రమోట్ చేస్తూ సినిమా ని విజయాపథం లో కి తీసుకొని వెళ్ళింది. ఈ సినిమా కి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ బాగా ఉపయోగపడటం తో పాజిటివ్ టాక్ డామినేషన్ వలన సినిమా విడుదల అయింది. అయితే మహేష్ మహర్షి కన్నా మనసుకు హత్తుకొనే సినిమాలు చాలా నే చేసాడు కానీ ఈ సినిమా నే తోపు అనే రేంజ్ లో ప్రమోషన్స్ చేయడం కాస్త ఎబ్బెట్టు గా అనిపించినా అందరూ పోనీ లే అని ఊరుకున్నారు.

ఇక ఒక వారం ప్రమోట్ చేసి విహార యాత్ర కి చెక్కేసిన మహేష్ అక్కడ కూడా ఫోటోలు పెడుతూ “సెలెబ్రేటింగ్ మహర్షి”అనే హాష్ టాగ్స్ పోస్ట్ చేయడమే ఫాన్స్ కి నచ్చట్లేదు. ప్రమోట్ చేసినంత చేసాడు. చూసే వాళ్ళు సినిమా ఎలాగో చూసారు. ఇక ఆ తర్వాత ఎవరూ సినిమా ని పట్టించుకోలేదు. అన్ని సినిమాల్లా ఇది కూడా క్రమక్రమంగా మరుగైపోతుంటే మహేష్ మాత్రం ఎక్కడికి వెళితే అక్కడ నుండి ఫోటోలు పెడుతూ సెలబ్రేటింగ్ మహర్షి అంటుంటే చాలా మంది అభిమానులకే చిరాకొస్తుంది.

మహేష్ టూ మచ్ చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎంత త్వరగా మహేష్ కామ్ అయితే అంత మంచిది అంటున్నారు కొంత మంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -