Thursday, April 25, 2024
- Advertisement -

వంద రోజుల ‘మహర్షి’

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో నే అత్యంత భారీ విజయవంతమైన చిత్రం గా నిలిచింది మహర్షి. ఈ సినిమా లో మహేష్ బాబు హీరో గా నటించగా, హీరోయిన్ గా పూజ నటించింది. ఒక కమర్షియల్ కథ లో మాస్ ఎలిమెంట్స్ ని జోడించి, అభిమానుల కి కావాల్సిన ఎమోషన్స్ ని, ఫైట్స్ ని పెట్టి, ఒక సామాజిక కోణాన్ని ఆవిష్కరించిన ఈ సినిమా ఇప్పుడు వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భం గా నిర్మాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.

“ఇంతటి ఘన విజయాన్ని మాకు అందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారికి, సూపర్ స్టార్ అభిమానులకి, ప్రేక్షకులకి, మరియు యూనిట్ మొత్తానికి మా ధన్యవాదాలు.” అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు తమ ప్రకటన లో తెలియజేసారు.

ఈ సినిమా కి వంశీ పైడిపల్లి దర్శకుడు. పూజ హెగ్డే హీరోయిన్ గా చేయగా, అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఇక పోతే ఈ సినిమా ని దిల్ రాజు, అశ్విని దత్ మరియు పీవీపీ కలిసి సంయుక్తంగా నిర్మించారు.

మహేష్ బాబు తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరు కూడా దిల్ రాజు నిర్మిస్తూ ఉండటం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -