Friday, March 29, 2024
- Advertisement -

ఆ డ్ర‌గ్‌కి బానిస‌న‌య్యానంటున్న మ‌హేశ్ బాబు భార్య న‌మ‌త్ర‌

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ భార్య న‌మ‌త్ర గురించి అంద‌రికి తెలిసిందే. న‌మ్ర‌త‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మ‌హేశ్. మిస్ ఇండియా అయిన న‌మ‌త్ర మ‌హేశ్‌ని పెళ్లి చేసుకున్న త‌రువాత పూర్తిగా తెలుగమ్మాయిగా మారిపోయింది. మ‌హేశ్ సినిమాల‌కు సంబంధించిన ప‌నుల‌తో పాటు, మ‌హేశ్ బాబు ద‌త్త‌త తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి పనుల‌ను కూడా ఆమె చూసుకుంటుంది.

అస‌లు మ‌హేశ్‌కు నేష‌న‌ల్ లేవ‌ల్లో ఇంత పాపులారిటీ రావ‌డానికి న‌మ్ర‌త‌నే ఓ కార‌ణం అని చాలామంది న‌మ్ముతుంటారు. తాజాగా ఆమె చేసిన ట్విట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నాకు ప్ర‌త్యేకంగా డ్ర‌గ్స్ అవ‌స‌రం లేదు. ఎందుకంటే నేను ఇప్పటికే మహేష్ బాబుకు చాలా ఎడిక్ట్ అయ్యానని క్లుప్తంగా వివరించారు. ఈ ఒక్క మాట‌తో మ‌హేశ్ బాబుపై త‌న ప్రేమ ఎలాంటిదో చెప్ప‌క‌నే చెప్పింది న‌మ్ర‌త‌. అటు మ‌హేశ్ బాబు కూడా భార్య న‌మ్ర‌త‌పై ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప్రేమ‌ను చాటుకుంటునే ఉన్నాడు.

సినిమా షూటింగ్‌ల‌కు కాస్తా గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో క‌లిసి విదేశాల‌కు వెళ్తుంటాడు మ‌హేశ్‌. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం మ‌హేశ్ మ‌హ‌ర్షి సినిమాలో న‌టిస్తున్నాడు. పూజా హెగ్డె హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మే 9న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

https://www.instagram.com/p/BwUvUX2jY3_/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_test&utm_campaign=embed_loading_state_script

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -