సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న మలైకా బ్యాగ్ ధర..?

301
malaika arora new big rate
malaika arora new big rate

సెలెబ్రిటీలు వేసుకునే డ్రెస్ నుంచి చెప్పులు…గాగుల్స్ ఇలా అన్ని పెద్ద విషయమే..పెద్ద విశేషమే..వాళ్లు కదిలినా..మెదిలినా అంతా విశేషాల పరంపరలే. అటువంటిదే బాలివుడ్ ప్రముఖ నటి మలైకా అరోరా వేసుకున్న బ్యాగ్ ధర గురించిన వార్తలు వైరల్ గా మారాయి.సెలబ్రిటీలు ఏ లుక్‌లో కనిపించినా… కెమెరా కళ్లు క్లిక్కుమంటాయి. వారిని టాప్ టూ బాటమ్ వరకూ స్కేన్ చేసిగానీ కెమెరాల కళ్లు శాంతించవు..ఆ ఫోటోలో చిన్న విశేషం కనిపించినా అదో పెద్ద వార్త అయి కూర్చుంటుంది అటువంటిదే మలైకా అరోరా విషయంలో అదే జరిగింది. ఎన్నో రోజుల హోమ్‌ ఐసోలేషన్‌ తరవాత మలైకా జనాల మధ్యకి వచ్చింది.

ఒక టీవీ రియాల్టీ షో షూటింగ్‌ పాల్గొనేందుకు తన పెంపుడు కుక్కతో పాటూ స్టూడియో ముందు దర్జాగా కారు దిగింది. అక్కడే కాచుకుని కూర్చున్న కెమెరాలు మలైకా లుక్‌ను క్లిక్‌ మనిపించాయి. ఆ ఫోటోలు చూసిన వారందరూ మలైకా వేసుకున్న డ్రెస్ గురించో..లేక ఆమె కుక్క గురించో మాట్లాడుకోవడం లేదు… కేవలం ఆమె వేసుకున్న ‘స్లింగ్‌ బ్యాగు’ గురించే టాపిక్ అంతా.

ప్రముఖ సెలెబ్రిటీ బ్యాగుల బ్రాండ్‌ గుషీ తయారుచేసిన బ్యాగు అది. లేత గులాబీ రంగులో చాలా చక్కగా చూడముచ్చటగా ఉంది. దాని ధరెంతో తెలుసా? అక్షరాలా లక్షా డబ్బై అయిదు వేల రూపాయలు. మహా అయితే అందులో చిన్న వాలెట్‌, ఓ ఫోను తప్ప ఇంకేమీ పట్టవు. అయినా రేటు మాత్రం అదిరిపోయేలా ఉంది. అదే ఇప్పుడు టాపిక్ అయి కూర్చుంది. సాధారణం సెలబ్రిటీలు పురుషులైతే..వారి బైక్స్, కార్స్, సూట్.. గాగుల్స్.. షూస్..టై ఇలా విశేషంగాఉంటాయి. అదే లేడీస్ అయితే వారి డ్రెస్ డిజైన్..హ్యాండ్ బ్యాగ్స్ కాస్ట్ ఎంత? అనేది పెద్ద విశేషం. సాధారణంగా హీరోయిన్లకు…బ్యాగుల కొనటంలో చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కడికెళ్లినా బ్యాగులు కొంటుంటారు. అది కాస్ట్లీ అయి ఉండాలి..పైగా ఓ బిగ్గెస్ట్ కంపెనీ డిజైన్ చేసిందై ఉంటాలని అనుకుంటుంటారు. అటువంటిదే మలైకా వేసుకున్న చిన్ని బ్యాగ్.

Loading...