Saturday, April 20, 2024
- Advertisement -

‘యాత్ర‌’కు బ్ర‌హ్మారథం ప‌డుతున్న మ‌ళ‌యాళ ప్రేక్ష‌కులు

- Advertisement -

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నేత డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి మ‌ర‌ణించి 10 సంవ‌త్స‌రాలు కావస్తోన్న ఆయ‌న ప్రవేశ‌పెట్టిన ప‌థ‌కాల ద్వారా ఆయ‌న ఇప్ప‌టికి ప్ర‌జ‌ల గుండెల్లో బ్ర‌తికే ఉన్నారని చాలామంది నమ్ముతుంటారు. ఇక ఆయ‌న రాజ‌కీయ జీవితంలోని ప్ర‌ముఖ ఘ‌ట్ట‌మైన పాద‌యాత్ర ఆధారంగా సినిమాను తెర‌కెక్కించారు. ఈ పాద‌యాత్రే ఆయ‌న‌ను సీఎం చేసింద‌ని అంటుంటారు రాజకీయ విశ్లేష‌కులు. యాత్ర అనే పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాలో వైఎస్ఆర్‌గా మ‌ళ‌యాళ సూప‌ర్‌స్టార్ మమ్మూట్టి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నిన్న‌నే(శుక్ర‌వారం) విడుద‌లైంది. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

యాత్ర సినిమా వైఎస్ అభిమానుల‌తో పాటు , సామాన్య ప్రేక్ష‌కుల‌ను సైతం ఆక‌ట్టుకుంది. మమ్ముట్టి ఆ పాత్రలో ఒదిగిపోయారని, దర్శకుడు చెప్పాలనుకున్న విషయాలను సూటిగా చెప్పాడని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 970 థియేటర్లలో విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. అయితే ఈ సినిమా తెలుగులో క‌న్నా ఈ సినిమా మ‌ళ‌యాళంలోనే పెద్ద హిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. మ‌ళ‌యాళంలో వైఎస్ఆర్ ఎవ‌రో పెద్ద‌గా ఎవ్వ‌రికి తెలియ‌దు. అయిన ఈ సినిమాకు అక్క‌డ బ్ర‌హ్మార‌థం ప‌డ‌టం విశేషం. యాత్ర సినిమా మ‌ళ‌యాళంలో సూప‌ర్ హిట్ కావడానికి ముఖ్యం కార‌ణం మ‌మ్మూట్టి అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇప్ప‌టి యువ‌తరానికి వైఎస్ఆర్ ఎవ‌రంటే ఎవ‌రో పెద్ద‌గా తెలియ‌దు. ఈ సినిమా ద్వారా ఆయ‌న ఎంత గొప్ప నాయ‌కుడో తెలిసేలా చేశాడు చిత్ర దర్శ‌కుడు మ‌హి వి. రాఘ‌వ‌. తెలుగులో ఆయ‌న ఎలాంటి నాయ‌కుడో అంద‌రికి తెలుసు.

ఈ సినిమా ద్వారా వైఎస్ఆర్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు మ‌ళ‌యాళ ప్రేక్ష‌కుల‌కు కూడా తెలిసేలా చేశాడు. ఇక ఈ సినిమా క‌లెక్ష‌న్లు కూడా ద‌మ్ములేపుతున్నాయి. మొద‌టి రెండు రోజులుగాను ఈ సినిమా 18 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసిన‌ట్లుగా సినీ విశ్లేషకులు తెలియ‌జేశారు. ఇప్ప‌టికే ఈ సినిమా లాభాల బాట ప‌ట్టింది. ముఖ్యంగా ఈ సినిమా రాయ‌ల‌సీమ‌లోని అన్ని థియోట‌ర్ల‌లో హౌస్‌ఫుల్‌తో ర‌న్ అవుతుంది. ప్ర‌స్తుత‌నికి అయితే యాత్ర సినిమా తెలుగులో క‌న్నా మ‌ళ‌యాళంలోనే పెద్ద హిట్‌గా నిలిచిందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -