Thursday, March 28, 2024
- Advertisement -

మనమంతా మూవీ రివ్యూ!

- Advertisement -

చంద్ర శేఖర్ యేలేటి సినిమాలు అంటే మొదటి నుంచీ తెలుగు ప్రేక్షకులకి ఒకరకమైన ఆసక్తి ఉంటూనే ఉంటుంది. ఆయన డైరెక్షన్ లో వచ్చిన అయితే దగ్గర నుంచీ మొన్న మొన్నటి సాహసం వరకూ అందరూ ఆదరించారు. అయితే కమర్షియల్ గా ఈ దర్సకుడు ఇప్పటి వరకూ అంతగా క్యాష్ చేస్కోలేక పోయాడు.

ముఖ్యంగా ప్రయాణం , ఒక్కడున్నాడు లాంటి సినిమా ఆర్ధికంగా శేఖర్ ని చాలా ఇబ్బంది పెట్టాయి. సాహసం సినిమాతో డబ్బులు బాగానే ఒచ్చినా కొత్త సినిమా చెయ్యడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకున్న శేఖర్ మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ ని పెట్టి ఏం తీసాడు అనేది చూద్దాం రండి

కథ – పాజిటివ్ లు :

ఒక మిడిల్ క్లాస్ మనిషి , సూపర్ మార్కెట్ లో పని చేసే పాత్ర చేసిన మోహన్ లాల్ ప్రమోషన్ కోసం పరితపిస్తూ ఉంటాడు. హౌస్ వైఫ్ పాత్ర లో అలనాటి హీరోయిన్ గౌతమీ నటించారు. కాలేజీ కుర్రాడుగా విశ్వనాథ్ , స్కూలు పాప గా రైనా నటించారు. ఈ సినిమా మొత్తం ఈ నలుగురి జీవితాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కానీ ఒకరితో ఒకరికి సంబంధం అనేది ఉండదు. స్టార్ కాస్ట్ , వారి పెర్ఫార్మెన్స్ లూ ఈ సినిమాకి చాలా పెద్ద ఆస్తి అని చెప్పాలి. మోహన్ లాల్ తన నటన ఏ రేంజ్ లో ఉంటుంది , సరైన పాత్ర ఇస్తే తన స్థాయి ఏంటి అనేది మళ్ళీ నిరూపించాడు. హౌస్ వైఫ్ పాత్రలో గౌతమీ చాలా కొత్తగా చేసారు. తీజేజ్ కురాడు , చిన్న పాప ఇద్దరూ నటన లో ఓనమాలు దిద్దే వయసు అన్నమాటే గానీ చాలా కొత్త తరహాగా కనిపించారు. కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా సాగిన స్క్రీన్ ప్లే సాధారణ ప్రేక్షకుడికి సైతం అర్ధం అయిపోతుంది. మోహన్ లాల్ పెద్ద హీరో అని చెప్పి పూర్తి నిడివి ఆయన మీద కానిచేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రతీ పాత్రకీ ఇంపార్టెన్స్ ఇచ్చాడు యేలేటి. మల్టీ లింగ్యువాల్ యాంతాలజీ సినిమాలు కొత్త అయిన తెలుగు ప్రేక్షకులకి కథలో ఎక్కడా దాపరికం లేకుండా జాగ్రత్తగా లాక్కొచ్చాడు యేలేటి. గొల్లపూడి, అనిశా , వెన్నెల కిశోర్ పాత్రలు బాగా కుదిరాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ లో పెద్ద ట్విస్ట్ లేకపోయినా క్లైమాక్స్ లో చాలా బాగా తీసారు, సెకండ్ హాఫ్ రేసీగా అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ సినిమా చాలా స్లో గా సాగడం పెద్ద మైనస్ అని చెప్పచ్చు. కథ పాతదే అయిన స్క్రీన్ ప్లే కొత్తగా ఉన్నప్పుడు ఫాస్ట్ గా సాగాలి గానీ స్లో గా ఉంటె జనాలకి ఎక్కదు . అసలే కొత్త కథ డైరెక్టర్ ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అనేదానికి సరైన నిర్వచనం ఇవ్వకపోతే ఇక ఇంతే సంగతులు. ఎమోషన్స్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసిన యేలేటి లాజిక్ ల విషయం లో అక్కడక్కడా ఫెయిల్ అయ్యాడు. గౌతమీ క్యారెక్టర్ కి ఇంకాస్త హై లైట్ చెయ్యాల్సింది. తారక రత్న రోల్ కూడా ఇంకాసేపు ఉంటె బాగుండు అనిపించింది. కామెడీ అస్సలు లేకపోవడం బీ సి సెంటర్ లలో సినిమా విసుగు తెప్పిస్తుంది. తనకి తానే డబ్బింగ్ చెప్పుకున్న మోహన్ లాల్ అక్కడక్కడా తడబడ్డాడు.

మొత్తంగా :

మొత్తంగా చూస్తే మనమంతా సినిమా ఒక డిఫరెంట్ అప్ప్రోచ్ అని చెప్పచ్చు. అటు ఆర్ట్ ఫిలిం గా కాకుండా ఇటు కమర్షియల్ పంథా లో కూడా సాగకుండా, ఆఫ్ బీట్ లో వెళుతుంది. నటీ నటుల పెర్ఫార్మెన్స్ లూ, ఎమోషన్ లూ చక్కగా క్యారీ చేస్తూ క్రిటిక్ ల మనసులు దోచే సినిమా ఇది. స్క్రీన్ ప్లే విషయం లో తనని కొట్టే వారు లేరు అని యేలేటి మళ్ళీ ఒకసారి నిరూపించారు. యేలేటి టేకింగ్ ని ఎవ్వరూ బీట్ చెయ్యలేరు అన్నట్టు ఉంది ఈ చిత్రం. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా క్లాసీగా డిఫరెంట్ గా సాగుతుంది. ఫామిలీ ప్రేక్షకులు ఆసక్తిగా చూడబోయే ఈ సినిమాకి సరైన ప్రమోషన్ ఉంటె గనక ఖచ్చితంగా హిట్ అయ్యే చాన్స్ లు ఉన్నాయి.

మనమంతా మూవీ రేటింగ్: 3.25/5

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -