పెళ్లి రోజు భయపడి పారిపోవాలనుకున్నా : మంచు లక్ష్మీ

6850
manchu lakshmi planned to runaway from her own wedding
manchu lakshmi planned to runaway from her own wedding

లాక్ డౌన్ వల్ల ఎలాంటి షూటింగ్ లు లేకపోవడంతో సెలబ్రిటీలంతా ఇంట్లోనే ఉంటున్నారు. తమ ఫ్యామిలీ తో గడుపుతున్నారు. ఇక కొందరు తమకు సంబంధించిన రేర్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదే క్రమంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ కూడా తన పాత ఫోటోలను పోస్ట్ చేసింది. అది కూడా ఆమె పెళ్లి ఫోటోలు కావడం విశేషం. తన పెళ్లి నాట ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.

’పెళ్లి కూతుర్ని మండపంలోకి తీసుకుని రమ్మని చెప్పిన టైంలో నాకు చాలా భయమేసింది. అంతేకాకుండా కంగారుపడ్డాను కూడా. బయటకు పారిపోవాలని దారి కూడా వెతుక్కున్నాను’ అంటూ మంచు లక్ష్మీ చెప్పింది. 2006 లో ఆండీ శ్రీనివాస్ ను వివాహం చేసుకుంది లక్ష్మీ మంచు. ఆ సమయంలో మోహన్ బాబుతో కలిసి తీయించుకున్న ఫోటోని కూడా పోస్ట్ చేసింది.

ఇక మంచు లక్ష్మీ పలు టీవీ షో లకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ‘అనగనగా ఓ ధీరుడు’ ‘దొంగాట’ ‘గుండెల్లో గోదారి’ ‘ఊకొడతారా.. ఉలిక్కిపడతారా’ అనే చిత్రాల్లో స్పెషల్ రోల్స్ ప్లే చేసి తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాధించుకుంది. ‘మిసెస్ సుబ్బలక్ష్మీ’ వంటి వెబ్ సిరీస్ లో కూడా నటించింది. సరోగసి పద్ధతి ద్వారా ఈమె ఓ పాపకి తల్లి కూడా అయ్యింది. తన పాపతో ఉన్న ఫోటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది మంచు లక్ష్మీ.

Loading...