Thursday, April 18, 2024
- Advertisement -

పవన్ అభిమానికి సాయం చేసిన మనోజ్..!

- Advertisement -

మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు కానీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటున్నారు. తన అభిమానులతో మాట్లాడుతునే.. ఇతర విషయాలపై కూడా చర్చిస్తుంటారు. ఇక ఆపదలో ఎవరైన ఉంటే వారికి వెంటనే సాయం చేయడంలో మనోజ్ ముందు ఉంటారు. తాజాగా మనోజ్ చేసిన ఓ పనికి పవన్ ఫ్యాన్స్ మనోజ్ పై బాగా ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు మంనోజ్ ఏం చేశాడంటే.. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన రిక్వెస్ట్ పై వెంటనే మనోజ్ స్పందించాడు.

పవన్ అభిమానికి ఓ కష్టం వచ్చింది. కానీ అతని ఆర్ధిక స్థోమత బాగలేదు. దాంతో తన కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, జేడీ లక్ష్మీ నారయణ, మంచు మనోజ్ లకు ట్యాగ్ చేశాడు. ఈ మేరకు తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానని తెలిపాడు. తాను ఎన్నికల టైంలో జనసేన కోసం బాగా తిరిగానని తెలిపిన సాయినాథ్.. పవన్ అంటే ఎంతో ఇష్టమని.. ఆయన కోసం ఏమైన చేయడానికి రెడీ అని తెలిపాడు.

ప్రస్తుతం తన తండ్రికి చాలా సీరియస్ గా ఉందని.. కోమాలో ఉన్నాడని.. వైద్యం చేయించేందుకు తన దగ్గర డబ్బులు లేవని.. దయచేసి సాయం చేయమని తన ట్వీట్ లో పేర్కొన్నాడు సాయినాథ్. అయితే సాయినాథ్ ట్వీట్ ను చూసిన మంచు మనోజ్ వెంటనే స్పందించాడు. మీ వివరాలు నాకు పంపు స్వామి.. మా వాళ్లు నీ దగ్గరకు వచ్చి కలుస్తారు.. ధైర్యంగా ఉండూ మీ నాన్నకు ఏం కాదంటూ రిప్లయ్ ఇచ్చాడు. దాంతో సాయినాథ్ సహా అతని కుటుంబ సభ్యులు, మెగా ఫ్యాన్స్ మంచు మనోజ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -