Thursday, April 25, 2024
- Advertisement -

మంచు మనోజ్ విడాకులు.. మంచి విష్ణు చెప్పింది ఇదే..!

- Advertisement -

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు వరుస సినిమాలు చేశారు. కానీ వారికి ఒక్కటి రెండు తప్పిస్తే పెద్ద ఊహించిన విజయాలు లేవు. అయినప్పటికి ఎక్కడ తగ్గకుండా సినిమాలు చేస్తున్నారు. ఇక మనోజ్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

అయితే ఇటీవలే మనోజ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాడు. గత కొంత కాలం నుంచి మనోజ్ ఏం సినిమా చేయలేదు. విడాకులు తీసుకున్న తర్వాత ఇటీవలే సినిమా మొదలు పెట్టాడు. అయితే మనోజ్ కొన్నాళ్ళు డిప్రెషన్ లో ఉండిపోయానని.. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నానని .. ఇక త్వరలో నిర్మాతగా మారి వరుసగా సినిమాలు చేస్తాను అని తెలిపాడు. ఇదిలా ఉండగా… మంచు మనోజ్ విడాకులు తీసుకున్న సమయంలో జరిగిన కొన్ని విషయాల్ని మంచు విష్ణు తెలిపాడు.

అయన మాట్లాడుతూ… ‘మనోజ్ విడాకులు తీసుకున్న టైంలో డిప్రెషన్ కు వెళ్ళిపోయాడు. ఆ టైములో ఓ అన్నగా నేను అతనికి ఓ మాట చెప్పాను.’టేక్ యువర్ ఓన్ టైం’. లైఫ్ ఛేంజింగ్ డెసిషన్ తర్వాత ఎవ్వరైనా డిప్రెషన్ లోనూ అలాగే కన్ఫ్యూజన్ లోనూ ఉండటం సహజం. కంగారు పడి ఏదో ఒక స్టెప్ తీసుకుంటే తప్పు చేసినట్టే..! కాబట్టి టైం తీసుకో..! కాలమే సమాధానం చెబుతుంది… అని చెప్పాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -