వైఎస్ వివేక‌నంద రెడ్డి మ‌ర‌ణంపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మంచు విష్ణు

512
Manchu Vishnu responds on YS Vivekananda Reddy Death
Manchu Vishnu responds on YS Vivekananda Reddy Death

హీరో మంచు విష్ణు వైఎస్ వివేక‌నంద‌రెడ్డి మ‌ర‌ణంపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. వైఎస్ ఫ్యామిలీతో మంచు ఫ్యామిలీకి మంచి బంధాలు ఉన్నా సంగ‌తి తెలిసిందే. వైఎస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మంచు విష్ణు. దీంతో అప్ప‌టి నుంచి టీడీపీ దూరంగా ఉంటు వ‌స్తు వ‌స్తోంది. ఇక వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై మంచు ఫ్యామిలీ కూడా తీవ్ర‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

అయితే వివేక మ‌ర‌ణనాన్ని కూడా కొంద‌రు రాజ‌కీయం చేయ‌టంపై మంచు విష్ణు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వైఎస్ వివేక మ‌ర‌ణంపై ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై కొందరు రాజకీయనాయకుడు చేస్తోన్న కామెంట్స్ వింటుంటే వారికి కనీసం మానవత్వం కూడా లేదనిపిస్తోందని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్యను ఖండించ‌కుండా నీచంగా మాట్లాడుతున్నా వారిపై ఆయ‌న ఫైర్ అయ్యారు. అఖరికి మ‌ర‌ణానాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నార‌ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మంచు విష్ణు. ఆయ‌న హీరోగా న‌టించిన ఓట‌ర్ సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌ల అయింది. ఈ సినిమా ఎన్నిక‌ల సంబంధించిన‌ది కావ‌డంతో అంద‌రి దృష్టి సినిమాపై ప‌డింది. ఈ సినిమాను ఎన్నిక‌లు అయ్యేలోపు విడుద‌ల చేయ‌నున్నారు.