Wednesday, April 24, 2024
- Advertisement -

పడక సుఖం ఇవ్వకుంటే ఛాన్స్ ఇవ్వరు : ఎన్టీఆర్ హీరోయిన్

- Advertisement -

సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో కొందరు మహిళలను దర్శక నిర్మాతలు లైంగికంగా వేధిస్తున్నారని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ చెప్పారు. తాజాగా ఇదే విషయంపై మరో హీరోయిన్ మంజరి ఫడ్నిస్ సంచలన కామెంట్స్ చేసింది.

విషయంలోకి వెళ్తే.. కొందరు దర్శకనిర్మాతలు తనకు ఛాన్స్ ఇస్తాం అని చెప్పి.. అడ్వాన్స్ కూడా ఇచ్చారని.. అయితే తీరా ఆ సినిమాకు సంతకం చేసిన తర్వాత పడక సుఖం తీర్చాల్సిందిగా కోరేవారని చెప్పింది. తనకు పెద్ద సినిమాల్లో ఛాన్స్ వచ్చినా.. దర్శకనిర్మాతలు ఏ మాత్రం సిగ్గులేకుండా పడుకుంటావా అని అడిగారని.. అందుకే ఆ చాన్స్ లను వదులున్నానని మంజరి చెప్పింది.

తాను సినిమాల్లో ఎక్కువకాలం కొనసాగలేకపోవడానికి ముఖ్య కారణం అదే అని చెప్పింది. తన సినిమాల్లో కొన్ని ప్లాప్ కావడం.. కాస్టింగ్ కౌచ్ వంటివి ఎదుర్కోవడం వల్ల డిప్రెషన్‌లో ఉండిపోయానని చెప్పింది. బెడ్ రూంకి వెళ్తనే అవకాశాలు వస్తాయని లేకుంటే రావని స్పష్టం చేసింది. అందుకే టాలెంట్ ఉన్నప్పటికి పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు రావడం లేదని.. చిన్న సినిమాలతో సరిపెట్టుకుంటున్నట్లు తెలిపింది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం, శుభప్రదం లాంటి సినిమాల్లో నటించిన ఈమె జూనియర్ ఎన్టీఆర్ శక్తి సినిమాలో కూడా నటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -