హీరోయిన్ త‌ల‌కు గాయం..ప‌రిస్థితి విష‌మం..!

324
Manju Warrier meets with an accident on sets of Santosh Sivan
Manju Warrier meets with an accident on sets of Santosh Sivan

మ‌ళ‌యాళ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్ త‌ల‌కు బ‌ల‌మైన గాయం అయినట్లు తెలుస్తుంది. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా ఆమె త‌ల‌కు గాయం అయింది.దర్శకుడు సంతోష్ శివన్ రూపొందిస్తోన్న ‘జాక్ అండ్ జిల్’ సినిమా షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో మంజూ వారియర్ కింద పడిపోవడంతో ఆమె తలకు బలమైన గాయం తగిలింది. వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు.

తీవ్రంగా రక్తస్రావం కావడంతో పాటు తలకు 10కి పైగా కుట్లు పడినట్లు తెలుస్తోంది. ఆమె మ‌రో రెండు రోజుల పాటు ఆస్ప‌త్రిలోనే ఉండాల‌ని డాక్ట‌ర్లు తెలిపారు.మంజూ వారియర్ త‌లకు గాయం అవ్వ‌డంతో షూటింగ్ వాయిదా ప‌డింది.ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. మంజూ వారియర్ ఆరోగ్యం పట్ల ఆమె అభిమానులు అందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.