Thursday, April 18, 2024
- Advertisement -

మూవీ రివ్యూ : మన్మధుడు 2 సమీక్ష

- Advertisement -

నాగార్జున అక్కినేని మరియు రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన చిత్రం మన్మధుడు 2. మన్మధుడు 2 అనే పేరు ఉంది కానీ ఈ సినిమా కి మన్మధుడు సినిమా కి కనెక్షన్ ఏమి ఉండదు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా కి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఈ సినిమా ని నిర్మించారు నాగార్జున. ఒక ఫ్రెంచ్ సినిమా కి ఇది తెలుగు లో రీమేక్. ఈ సినిమా యొక్క సమీక్ష కింద పొందుపరచబడింది. చదవండి.

కథ:
సామ్ (నాగార్జున) పోర్చుగల్ లో పెర్ఫ్యూమార్ గా ఉంటాడు. పెళ్ళి చేసుకోకూడదు అని నిర్ణయించుకుంటాడు కానీ అది అతనికి సాధ్యపడదు. ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేసుకోవాల్సిందే అని పోరు పెడతారు. తల్లి ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ కూడా చేస్తుంది. ఈ దశ లో సామ్ కి అవంతిక పరిచయం అవుతుంది. ఆ పరిచయం సామ్ కి ఏ విధం గా కలిసొచ్చింది? సామ్, అవంతిక కలిసి ఏం చేశారు? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా కథ.

నటీనటులు పనితీరు:
నాగార్జున అక్కినేని నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. 60 ఏళ్ళ వయసులో కూడా నాగార్జున చాలా అందంగా డైనమిక్ గా కనిపిస్తారు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో నాగార్జున పూర్తి స్థాయిలో తన పాత్రకి న్యాయం చేశారు. రకుల్ ప్రీత్ కు కూడా ఈ సినిమాలో చాలా మంచి పాత్ర దక్కింది. పర్ఫామెన్స్ కి స్కోప్ లేనప్పటికీ తన పాత్ర పరిధి మేరకు రకుల్ ప్రీత్ చాలా బాగా నటించింది. లక్ష్మి తన పాత్రకు ప్రాణం పోసారు అని చెప్పుకోవచ్చు. ఆమె అద్భుతమైన నటన సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. వెన్నెల కిషోర్ కు ఈ సినిమాలో చాలా మంచి పాత్ర దొరికింది. తన పాత్ర తో తెరపై ఉన్నంతసేపు ప్రేక్షకులలో నవ్వుల జల్లులు కురుస్తూనే ఉంటాయి. రావు రమేష్ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. దేవదర్శిని కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. ఇక సమంత అక్కినేని, కీర్తి సురేష్, అక్షర గౌడ గెస్ట్ అప్పీరన్స్ లు సినిమాకి హైలైట్గా నిలుస్తాయి.

సాంకేతిక వర్గం పనితనం:
రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా కోసం ఒక చక్కని స్క్రిప్ట్ ను సిద్దం చేసుకోవడం లో విఫలమయ్యారు. ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టించకుండా సినిమాను వినోదాత్మకంగా చాలా బాగా నెరేట్ చేయాలనే తపన అస్సలు కనిపించలేదు. ప్రేమ కథలను చాలా బాగా హ్యాండిల్ చేయగలనని ఈ సినిమాతో నిరూపించుకోలేకపోయాడు రాహుల్ రవీంద్రన్. కిట్టు విస్సాప్రగడా ఈ సినిమాకి అందించిన డైలాగులు చాలా బాగున్నాయి. నాగార్జున అక్కినేని అందించిన నిర్మాణ విలువలు సినిమాకి ప్లస్ పాయింట్ గా మారాయి. క్వాలిటీ పరంగా ఏ మాత్రం రాజీపడకుండా నాగార్జున మంచి బడ్జెట్ ను అందించారు. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం సినిమాకు మైనస్పాయింట్. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేయకపోగా, మూడ్ సెట్ చేయడం లో విఫలమయింది. సినిమాటోగ్రాఫర్ ఎం సుకుమార్ విజువల్స్ చాలా బాగున్నాయి. అతని కెమెరా యాంగిల్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. చోట కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు:
కథలో పెద్ద స్పెషాలిటీ అంటూ ఏమీ లేకపోయినప్పటికీ దర్శకుడు కథను మలిచిన తీరు ఆకట్టుకొనే విధం గా లేదు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమాలో మొదటి హాఫ్ మొత్తం కామెడీ మరియు రొమాన్స్ తో నిండి ఉంటుంది. నాగార్జున మరియు రకుల్ ప్రీత్ ల మధ్య లవ్ ట్రాక్ మరియు ఫస్టాఫ్లో కొన్ని సన్నివేశాల్లో కామెడీ ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. సినిమాలోని సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ గా మారుతుంది. నాగార్జున అద్భుతమైన నటన, కామెడీ మరియు నిర్మాణ విలువలు సినిమాకి ప్లస్ పాయింట్ గా పరిగణించవచ్చు. రెండవ హాఫ్ లోని కొన్ని సాగతీత సన్నివేశాలు మైనస్ పాయింట్లుగా మారతాయి. కథ ప్రకారం ‘మన్మధుడు’, ‘మన్మధుడు 2’ సినిమాల కి సంబంధం ఉండదు. ‘మన్మధుడు’ తో పోల్చకుండా, ‘మన్మధుడు 2’ ఒక ఫ్రెష్ సినిమా అనుకోవాలి. ఈ సినిమా డిస్సప్పాయింటింగ్ గా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -