Friday, March 29, 2024
- Advertisement -

13 న విడుదల కాబోతున్న ‘మన్మధుడు 2’

- Advertisement -

కింగ్ అక్కినేని నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమా లలో ఒకటైన ‘మన్మధుడు’ సినిమా కి సీక్వెల్ గా ‘మన్మధుడు 2’ అనే టైటిల్తో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. గత కొంత కాలంగా బాలీవుడ్, కోలీవుడ్ లలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అప్దేట్ల కోసం అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల 13న ‘మన్మధుడు 2’ చిత్ర టీజర్ విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సమంత గెస్ట్ పాత్రలో కనిపించబోతోంది. కీర్తి సురేష్ మరియు అక్షర గౌడ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, వయోకాన్ 18 మోషన్ పిక్చర్స్ మరియు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. ‘మన్మధుడు’ సినిమా లాగానే ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -