ఒళ్లు గగుర్పొడిచే సీన్స్‌తో ‘మర్దానీ 2’ ట్రైలర్‌

298
Mardaani 2 Trailer Review
Mardaani 2 Trailer Review

బాలీవుడ్‌ బ్యూటీ రాణి ముఖర్జీ లేటెస్ట్‌ మూవీ ‘మర్దానీ 2’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 2014లో విజయాన్ని సొంతం చేసుకున్న మర్దానీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 13న విడుదలకానుంది.

పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిణిగా శివానీ శివాజీరాయ్‌ పాత్రలో రాణి ముఖర్జీ నటించింది. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో, ప్రతీ సీన్‌ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా ట్రైలర్‌ ఉంది. అ‍త్యాచారాలు చేస్తూ వరుస హత్యలు చేస్తున్న సైకో మృతదేహాలకు రాణీ ముఖర్జీ మాస్క్‌లు పెట్టి ఆమెకు సవాల్‌ విసురుతాడు.

హంతకుడిని పట్టుకోడానికి రాణీ ఏం చేసింది? ఆ దారుణాలను ఎలా అరికట్టింది? అనేది సినిమాలో చూడాలి. ‘మర్దానీ 2’లో విక్రమ్‌ సింగ్‌ చౌహాన్‌, శ్రుతి బాప్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపీ పుత్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రచిత ఆరోరా మ్యూజిక్‌ అందించారు.

Loading...