తేజ్ కి మారుతీ కి హీరోయిన్ విషయం లో ద్వందాబిప్రాయం

250
Maruthi, Sai Dharam Tej film to go on floors in June
Maruthi, Sai Dharam Tej film to go on floors in June

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో చిత్రలహరి ఇచ్చిన విజయం తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అదే విధంగా తేజ్ తన కెరీర్ ని మంచిగా సెట్ చేసుకొనేందుకు సక్సెస్ అయినా డైరెక్టర్స్ తో పని చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ఆ దిశలో నే త్వరలో తేజ్ మారుతి దర్శకత్వం లో ఒక చిత్రం లో నటించనున్నాడు అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. భోగి అని లేకుంటే ప్రతి రోజు పండగ అనే రెండు టైటిల్స్ లో ఏదో ఒక దాన్ని మేకర్స్ ఈ సినిమా కి పెట్టాలి అని అనుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు ప్రస్తుతం అందరిలో నూ ఆసక్తి ని రేకెత్తిస్తుంది.

అయితే అసలు విషయానికి వస్తే, ఈ సినిమా కి హీరోయిన్ విషయం లో డైరెక్టర్ కి హీరో కి అభిప్రాయలు కలవడం లేదట. తన తో మహానుభావుడు సినిమా కి పని చేసిన మెహ్రీన్ ని తీసుకుందాం అని మారుతి అంటే, తాను ఆల్రెడీ తన తో జవాన్ కి పని చేశాను అని, ఆ సినిమా పెద్దగా ఆడలేదు అని ఎవరైనా హిట్ లో ఉన్న హీరోయిన్ ని తీసుకుందాం అని తేజ్ అంటున్నాడట, ఈ విషయం పై చర్చ నడుస్తుంది.

ఇది ఫైనల్ అయితే కానీ మిగిలిన విషయాలు ముందుకు కదలవు అని టాక్.

Loading...