మా త‌మ్ముడు రాజ‌కీయాల‌కు ప‌నికిరాడు – నాగ‌బాబు

351
Mega brother nagababu comments on pawan kalyan
Mega brother nagababu comments on pawan kalyan

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మద్ద‌తు తెలుపుతునే ఉన్నారు. రాజ‌కీయంగా ప‌వ‌న్ టార్గెట్ చేసిన వారిని నాగ‌బాబు టార్గెట్ చేసి మ‌రి విమ‌ర్శిస్తున్నారు. దీని కోసం ఏకంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టారు నాగ‌బాబు. ఇక ఇటీవ‌లే ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ 5 సంవ‌త్స‌రాల‌ను పూర్తి చేసుకుంది. ఈ సమావేశం కోసం నాగబాబు కూడా రాజమండ్రి వెళ్లారు. త‌న త‌మ్ముడి ప్ర‌చారాన్ని జ‌నాల‌లోని నుంచోని మ‌రి వీక్షించారు నాగ‌బాబు. తాజాగా ఆయ‌న ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు …జనం మధ్య పవన్ ఎలా ఉపన్యాసం ఇస్తాడో చూడాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని, తమ్ముడు ఉద్వేగంతో మాట్లాడుతున్నప్పుడు జనాల స్పందన చూసి తాను కూడా ఎమోషనల్ అయినట్లు నాగబాబు చెప్పారు.

ఇక ప‌వ‌న్ పార్టీ పెట్టిన‌ప్పుడు నేను సందేహించాన‌ని తెలిపారు. ప‌వ‌న్‌లాంటి వ్య‌క్తిత్వం క‌లిగిన వారు రాజ‌కీయాల‌కు ప‌నికిరార‌ని అనుకున్నాన‌ని, కాని నేను ఆలోచించిన విధానం త‌ప్ప‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ నిరుపించాడని తెలిపారు నాగ‌బాబు.ఈ రోజు పవన్‌ని చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు నాగ‌బాబు. పవన్ లాంటి వ్యక్తులు ఎక్క‌డో ఒక‌రు పూడ‌తార‌ని చెడుతు త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేశాడు.