మా అన్నదమ్ముల మ‌ధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయి కాని..

584
Mega brother nagababu once again fire on balakrishna
Mega brother nagababu once again fire on balakrishna

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు గ‌త కొంతకాలం నుంచి హీరో బాల‌కృష్ణ‌పై కామెంట్స్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో త‌మ కుటుంబంపై బాల‌య్య చేసిన కామెంట్స్‌పై నాగ‌బాబు వీడియోల రూపంలో మండిప‌డుతున్నారు. తాజాగా మ‌రోసారి బాల‌య్యపై మ‌రో వీడియోను విడుద‌ల చేశాడు నాగ‌బాబు. గతంలో ఓ విలేక‌రి అడిగిన ప్రశ్న‌కు స‌మాధానం ఇస్తు ఎన్టీఆర్ కాలి గోరుకి కూడా ప‌నికి రార‌ని చెప్పారు బాల‌య్య‌.

దీనిపై స్పందించిన నాగ‌బాబు బాల‌య్య‌పై ఫైర్ అయ్యారు. మీ నాన్న మీకు గొప్ప కావచ్చు. అలా అంటే ప్ర‌తి కొడుక్కి త‌న తండ్రి గొప్ప‌వాడిగానే క‌నిపిస్తాడు. కాని ఈ విషయంలో కూడా చిరంజీవిగారి మీద మీరు నోరు జారారు. ఎన్టీఆర్ గొప్ప న‌టుడే ఇందులో ఎవ్వ‌రికి ఎటువంటి సందేహం లేదు. ఈ విష‌యంలో చిరంజీవి గారిని చుల‌క‌న చేయ‌ల్సిన అవ‌స‌రం ఏముంద‌ని నాగ‌బాబు ప్ర‌శ్నించారు. వేరొకరి గురించి తప్పుగా మాట్లాడతారా..? ఎంత అహంకారం మీకు..? ఏ మాకు మాట్లాడడం చేతకాదా… అంటూ మండిపడ్డారు.

మాకు సంస్కారం అడ్డోచ్చి ఆగాము కాని , చేత‌కాక కాదు. మీ తండ్రి మీకు గొప్ప అయితే , మా అన్నయ్య మాకు గొప్ప‌.
”మా అన్నయ్య మాకు తండ్రిలాంటి వాడు.. మా మధ్య కూడా అభిప్రాయబేధాలు ఉంటాయి కానీ మా అన్నదమ్ముల మధ్య అనుబంధం చెక్కుచెరగదు. మేము క‌లిసేఉండే అన్నదమ్ములం, కొట్టుకునే అన్న‌ద‌మ్ములం కాద‌ని బాల‌య్య‌కి వార్నింగ్ ఇచ్చాడు నాగ‌బాబు. ఇక తాను ఈ వివాదానికి ముగింపు ప‌లుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు నాగ‌బాబు.