జ‌న‌సేన త‌రుపున ప్ర‌చారం చేయ‌నున్న మెగా డాట‌ర్‌…?

244
Mega daughter niharika campaign to pawan kalyan janasena
Mega daughter niharika campaign to pawan kalyan janasena

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన సంగ‌తి అంద‌రికి గుర్తు ఉండే ఉంటుంది. చిరంజీవిని సీఎంగా చూడల‌ని ఆయ‌న అభిమానుల‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా ఆకాక్షించారు. చిరంజీవి కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, అల్లు అర‌వింద్‌, నాగ‌బాబు వంటి వారు చిరంజీవి త‌రుపున ప్ర‌చారం చేసిన‌ప్ప‌టికి ఆ ఎన్నిక‌ల్లో చిరంజీవి ఘోరంగా ఓడిపోయారు. ఆ త‌రువాత చిరంజీవి త‌న పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

దాని త‌రువాత జ‌రిగిన ప‌రిణ‌మాల‌తో ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ పెట్టారు. చిరంజీవితో విభేదించి మ‌రి పార్టీ పెట్టారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇదే స‌మ‌యంలో త‌న ఫ్యామిలీని పార్టీలోకి తీసుకోన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది అన్ని పార్టీలు త‌మ ఫ్యామిలీల‌ను రంగంలోకి దించుతున్నాయి. టీడీపీ త‌రుపున చంద్ర‌బాబు, లోకేశ్‌, బాల‌కృష్ణ వంటి వారితో పాటు నారా రోహిత్‌, తార‌క ర‌త్న వంటి వారు ప్ర‌చారం చేస్తున్నారు. ఇక వైసీపీ త‌రుపున జ‌గ‌న్‌, విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌తో పాటు ఆలీ, జ‌య‌సుధ‌, కింగ్నాగ‌ర్జున వంటి వారు ప్ర‌చారం చేయ‌నున్నారు.

అయితే జ‌న‌సేన త‌రుపున ప‌వ‌న్ క‌ల్యాణ్ తప్ప మ‌రో వ్య‌క్తి క‌నిపించ‌డం లేదు. అయితే తాజాగా మ‌న‌కు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌నసేన త‌రుపున మెగాడాట‌ర్ నిహారిక ప్ర‌చారం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ ప‌వ‌న్‌తో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. దీనికి ప‌వ‌న్ మొద‌ట అంగీక‌రించ‌లేద‌ట‌, కాని ఫ్యామిలీ ఒత్తిడి చేయ‌డంతో కాద‌న‌లేక‌పోయార‌ట‌. దీంతో జన‌సేన త‌రుపున నిహారిక ప్ర‌చారం చేయ‌డం క‌న్ఫ‌ర్మ్ అయింది. సినిమాల్లో ఫెయిల్ అయిన నిహారిక , ప‌వ‌న్‌కు ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.