Friday, April 19, 2024
- Advertisement -

నానిని బూతులు తిడుతు పోస్ట్‌లు పెడుతున్న మెగా ఫ్యాన్స్‌

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నానిని మెగా అభిమానులు ప‌చ్చి బూతులు తిడుతున్నారు. అదేంటి నాని అంద‌రితో బాగానే ఉంటారు క‌దా , మ‌రి మెగా ఫ్యాన్స్‌ను నానిని ఎందుకు టార్గెట్ చేశార‌ని అనుకుంటున్నారా? ఏం లేదండి నాని కొత్త‌గా న‌టిస్తున్న సినిమాకు మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సినిమా పేరు పెట్టారు. చిరంజీవి 1990ల‌లో న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ ఎంత‌టి విజ‌యం సాధించిందో ఈత‌రం అభిమానుల‌కు తెలియ‌క‌పోవ‌చ్చు కాని, చిరంజీవి అభిమానుల‌కు మాత్రం గ్యాంగ్ లీడ‌ర్ సినిమా గురించి తెలుసు. ఈ సినిమాతోనే చిరంజీవి మాస్ ప్రేక్షకుల‌కు ద‌గ్గ‌ర అయింది. అలాంటి సినిమా టైటిల్‌ను నాని ఎలా వాడుకుంటాడని మెగా అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.

సినిమా టైటిల్‌ను పెట్టుకునే అర్హ‌త ఒక్క రామ్ చ‌ర‌ణ్‌కు మాత్ర‌మే ఉంద‌ని వారు తెలుపుతున్నారు. ఈ విష‌యంలో నానిని తెగ తిట్టేస్తున్నారు మెగాస్టార్ అభిమానులు. సినిమా టైటిల్ మార్చుకోక‌పోతే ,సినిమాను ట్రోల్ చేస్తామ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. నిన్న నాని పుట్టిన రోజు కావ‌డంతో త‌న కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్‌ను ఫిక్స్ చేయ‌డంతో ఈ వివాదం మొదలైంది. ఈ సినిమాకు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.ఈ సినిమాను వ‌చ్చే ఆగ‌స్టులో విడుదల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -