Friday, March 29, 2024
- Advertisement -

గెటప్ శ్రీనుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి..!

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పల్సిన అవసరం లేదు. గురు, శుక్రవారం ఈ షో వస్తే జనలు ఎగపడి చూస్తారు. జబర్దస్త్ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ అయ్యారు. కొంత మంది టీం లీడర్ గా కూడా ఎదిగారు. ఇక జబర్దస్త్ షో ద్వారా గెటప్ శ్రీను మంచి పేరు తెచ్చుకున్నాడు. రకరకల గెటప్స్ బాగా ఫాపులర్ అయ్యాడు. ఎలాటి గేటప్ వేసిన అందులో జీవిచడం శ్రీను స్పెషాలిటీ. అందుకే ఏకంగా ప్రేక్షకులు అతని శ్రీను అని కాకుండా గెటప్ శ్రీను అని పిలుచుకుంటారు.

అయితే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ ఐన గెటప్ శీను సినిమాల్లో కూడా చాలా అవకాశాలు దక్కించుకున్నాడు . అయితే తాజాగా గెటప్ శీను బంపర్ ఆఫర్ కొట్టేసాడు. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో గెటప్ శీను ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన లేనప్పటికీ గెటప్ శ్రీను మాత్రం సంకేతాలు అందాయని స్వయంగా వెల్లడించాడు.

ఇటీవలె జబర్దస్త్ టీంతో చిరంజీవిని గెటప్ శీను కలిసేందుకు వెళ్ళినప్పుడు… కొరటాల శివ సినిమాలో నీకు ఒక మంచి పాత్రని అనుకున్నారని మెగాస్టార్ చిరంజీవి చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని తెలిపాడు గెటప్ శ్రీను .మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమాలో నటించడం కంటే అదృష్టం ఏముంటుందని గెటప్ శీను తెలిపాడు. అయితే అధికారికంగా మాత్రం ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉందని గెటప్ శీను తెలిపాడు. ఇదిలా ఉంటే ఇటీవలే మెగా బ్రదర్ జబర్దస్త్ జడ్జి నాగబాబు కూడా గెటప్ శీను పై ప్రశంసల వర్షం కురిపించాడు. గెటప్ శ్రీను లాంటి నటుడిని ఇండస్ట్రీ వాడుకోకపోతే నష్టపోతుందని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -