Saturday, April 20, 2024
- Advertisement -

ఘనంగా జరుగుతున్న మెగా స్టార్ పుట్టినరోజు వేడుక

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే అది మెగా అభిమానులకు ఒక పండుగ రోజు. ప్రతి ఏడాది సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ చిరు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే మెగా అభిమానులు ఈ ఏడాది కూడా ఒకరోజు ముందు నుంచే సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. తాజాగా ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుక హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మెగా అభిమానులు ఈ వేడుకకు వేలల్లో తరలివచ్చారు. మెగా అభిమానులు మాత్రమే కాక కొందరు ప్రముఖులు కూడా ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా విచ్చేశారు.

చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చారు. అంతే కాకుండా ఈ వేడుకలో మాట్లాడుతూ తన అన్నయ్య చిరు గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ చిరంజీవి తదుపరి సినిమా అయిన ‘సైరా’ నరసింహారెడ్డి సినిమా గురించి కూడా మాట్లాడారు. ఆ సినిమా ని కొణిదల ఇంటిపేరు పెట్టుకున్న రామ్ చరణ్ స్వయంగా నిర్మించడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2 న విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -