Friday, March 29, 2024
- Advertisement -

కేసీఆర్ కోరిక మేరకు చిరంజీవి సంచలన నిర్ణయం

- Advertisement -

కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఇప్పటికే ఇండియాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 100 కు చేరువ అవుతోంది. కరోనా మరింతగా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు, కళాశాలలకు విద్యాసంస్థలకు బంద్ ఇచ్చాయి. తెలంగాణ సర్కారు సైతం మార్చి 31వ వరకు తెలంగాణలో సెలవులు ప్రకటించింది.

కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమపై కూడా ఈ ప్రభావం భారీగా పడింది. ఎంటర్ టైన్ మెంట్ రంగానికి పెద్ద దెబ్బగా దీన్ని పరిగణిస్తున్నారు. సినిమా థియేటర్స్ అన్నింటిని మూసివేయాలని ఆదేశించడంతో చిత్రాలకు, నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.

తాజాగా సీఎం కేసీఆర్ జనసమర్థమైన అన్ని కార్యక్రమాలను తెలంగాణలో రద్దు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. దీంతో మెగా స్టార్ చిరంజీవి, కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం షూటింగ్ వాయిదా పడింది. భారీ వ్యయంతో అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ షూటింగ్ ను 10 నుంచి 15 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు.

ఈ సందర్భంగా చిరంజీవి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై ప్రశంసలు కురిపించారు. కరోనా వ్యాప్తి చెందకుండా సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలకు ప్రజల సహకారం అవసరమని.. కరోనా నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు అభినందనీయం అని అన్నారు.

నా బాధ్యతగా తాను నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ షూటింగ్ ను 10 నుంచి 15 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు చిరంజీవి ప్రకటించారు. నా నిర్ణయాన్ని దర్శకుడు కొరటాల శివ కూడా అంగీకరించాడని తెలిపారు. దీనివల్ల ఆర్థికంగా నష్టమైనా ఆరోగ్యానికి మించిది మరేది కాదని చిరంజీవి స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -