చిరంజీవి ఇంటిని చూస్తే ఎవరైన షాకే..!

3443
Megastar chiranjeevi shares his NEW house video
Megastar chiranjeevi shares his NEW house video

మెగాస్టార్ చిరంజీవి.. సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థాన్ని సంపాధించుకున్న హీరో. ఆయనకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొన్ని దశాబ్దాలుగా నెంబర్ వన్ స్టార్ గా ఉన్నారు చిరు. ఎంతో మంది దర్శకులకు, అర్టిస్టులకు, నిర్మాతలకు అవకాశం ఇచ్చారు. తాజాగా చిరంజీవి షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరోనా వైరస్ కారణంగా వేళ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. తొమ్మిదో రోజు లాక్ డౌన్ ఇలా మొదలైందంటూ చిరంజీవి ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇంట్లోనే ఉండండి క్షేమంగా ఉండండని తెలిపాడు. చిరు షేర్ చేసిన వీడియోలో ఉన్న ఇంటిని, స్విమ్మింగ్ పూల్‌ను చూస్తే ఎవ్వరైనా షాక్ కావాల్సిందే.

అందమైన సన్ రైజ్… ఉదయం లేచాక ఎంత ప్రశాంతంగా ఉందో.. కాలుష్యం లేక సిటీ అందంగా కనిపిస్తోంది.. పక్షుల కిలకిలా రావాలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.. దీనిని బట్టి చూస్తుంటే మనం ఎంత మిస్సయిపోతున్నామో? ఈ దైనందిన జీవితంతో.. మన భూమిని మనమే పాడు చేసుకుంటున్నాం. కోరి పోగొట్టుకుంటున్నామనిపిస్తోంది. ఇప్పటికైనా రియలైజ్ కావాలి. నేచుర్ ని కాపాడుకోవాలి అని ఆ వీడియోలో చిరు అన్నారు.

చిరంజీవికి ప్రకృతి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొని.. మొక్కలు నాటిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఉదయం లేవగానే చేసే పని ఇదేనంటూ.. మొక్కలకు నీరు పడుతున్న ఫోటోను షేర్ చేశాడు. అయితే తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో ఆయన ఇంటి నిర్మాణం అందర్నీ ఆకట్టుకుంది. ఆ ఇంటి నిర్మాణాన్ని చూస్తే ఇంద్రభవనంలా ఉంది. దాదాపు వంద కోట్లతో చిరు తన అభిరుచికి తగ్గట్టు ఇంటిని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. మీరు కూడా ఆ వీడియోని చూసేయండి.

View this post on Instagram

Happy Sri Rama Navami to All! #StayHomeStaySafe

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

Loading...