Thursday, April 25, 2024
- Advertisement -

ఫ్లాప్స్ లో ఉన్న మెహ్రీన్… పంజాబ్ పయానం

- Advertisement -

మెహ్రీన్ కౌర్.. తెలుగు సినిమా పరిశ్రమ లో కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమా తో అడుగు పెట్టింది. నాని సరసన నటించిన ఈ భామ ఈ సినిమా తో పెద్ద విజయమే సాధించింది. దాని తో పాటు వరుస అవకాశాలు కూడా పొందిన మెహ్రీన్ ఆ తర్వాత చాలా సినిమా లు చేసినా తోలి సినిమా తో పొందిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇటీవల కాలం లో అయితే అసలు హిట్ తన దరిదాపుల్లో కూడా లేకుండా పోయింది.

ఈ ఏడాది మొదట్లో వచ్చిన బ్లాక్బస్టర్ F2 సినిమా లో హీరోయిన్ గా నటించినా కానీ ఆ సినిమా విజయాన్ని తనకి అనుకూలం గా మార్చుకోవడం లో విఫలమయింది మెహ్రీన్. అయితే ఇప్పుడు తాజాగా మెహ్రీన్ నార్త్ లో అవకాశాలని ఒడిసి పెట్టె ప్రయత్నం చేస్తుంది DSP దేవ్ అనే ఒక పంజాబీ సినిమా లో ఈ భామ హీరోయిన్ గా చేయనుంది. దేవ్ ఖరౌడ్ ఈ సినిమా లో హీరో పాత్ర చేయనున్నాడు.

ఈ సినిమా జులై 5 న విడుదల కానుంది. బేసిక్ గా పంజాబీ ఫామిలీ కి చెందిన మెహ్రీన్ ఇప్పటి దాకా పంజాబీ పరిశ్రమ లో అడుగు పెట్టలేదు. అందుకే ఇప్పుడు తెలుగు తమిళం లో పెద్దగా విజయాలు లేకపోవడం తో తన ఇంట ఏ మాత్రం లక్ పని చేస్తుందా అనే ఉదేశ్యం తోఈ ప్రయత్నం చేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -