Thursday, March 28, 2024
- Advertisement -

హీరోయిన్ పేరు ఎక్క‌డ టాటు వేస్కున్నాడో చూడండి

- Advertisement -

సినీన‌టులపై వీరాభిమానులు ఉంటారు. వారి కోసం ప్రాణ‌త్యాగానికైనా వెన‌కాడ‌ని పిచ్చి అభిమానులు కూడా ఉంటారు. పాలాభిషేకాలు, ర‌క్తాభిషేకాలు, పూలాభిషేకాలు, క‌టౌట్లు, త‌ల‌పై, చేతుల‌పై టాటులు వేసుకుంటూ త‌మ అభిమానాన్ని చూపించుకుంటారు. క‌న్న‌వాళ్ల‌పై ప్రేమాభిమానాలు చూప‌రు కానీ ఎక్క‌డో ఉన్న సినీన‌టుల పేర్ల‌ను త‌మ గుండె, చేతుల‌పై టాటులు వేసుకుంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ కోసం ఓ వీరాభిమాని గొంతుపై టాటు వేసుకున్నాడు.మంచి సినిమాల‌తో ఇప్పుడు బాగా అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న హీరోయిన్ మెహ‌రీన్ పిర్జద‌. ఆమె న‌టించిన సినిమాలు సూప‌ర్‌హిట్ అవుతుండ‌డంతో అంద‌రూ అభిమానం పెంచుకుంటున్నారు. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ సినిమాతో ఎంట‌రై మ‌హానుభావుడు, రాజాది గ్రేట్ త‌దిత‌ర సినిమాల‌తో మెరిసిన మెహ‌రీన్‌కు ఓ అభిమాని మెడ‌పై టాటు వేసుకున్నాడు.

ఓ యువ‌కుడు గొంతుపై ‘మెహ్రీన్‌’ అని ఆంగ్ల అక్ష‌రాల‌తో మంచి డిజైన్‌తో పేరు టాటు వేయించుకున్నాడు. అది టాటు కూడా కాదు ప‌చ్చ‌బొట్టు అది. జీవితాంతం ఆ ముద్ర ఉండిపోద్ది. అయితే దీనిపై హీరోయిన్ బాధ వ్య‌క్తం చేసింది.‘మాపై అభిమానంతో మిమ్మల్ని మీరు బాధపెట్టుకోకండి’ అని మెహరీన్ కోరింది. ఆ అభిమాని టాటు వేస్కున్న ఫొటోను మెహరీన్‌ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ కొంచెం అభిమానుల‌కు సూచ‌న‌లు ఇచ్చారు. ‘మీ ప్రేమకు ధన్యవాదాలు. కానీ ఇలా మిమ్మల్ని మీరు బాధించుకోకండి. మీ అందర్నీ ఎంతో అభిమానిస్తున్నా’ అని పేర్కొంటూ అలాంటి ప‌నులు చేయొద్దు అని కోరుతోంది.మెహరీన్ ప్ర‌స్తుతం ‘ఫిలౌరీ’ అనే హిందీ చిత్రంలోనూ నటించింది. ప్రస్తుతం ఆమె విజయ్‌ దేవరకొండతో ‘నోటా’ సినిమా చేస్తోంది. మ‌రికొన్ని సినిమాల‌తో బిజీగా ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -