Saturday, April 20, 2024
- Advertisement -

ఆ హీరోయిన్ విమర్శకుల నోళ్ళు మూయించినట్టేనా?

- Advertisement -

ఈ ఏడాది మొదట్లో f2 సినిమా తో పెద్ద విజయం సాధించినా కానీ అవకాశాల వేట లో వెనకబడింది అని మెహ్రీన్ పైన చాలా మంది చాలా విధాలుగా విమర్శలు చేశారు. అయితే మెహ్రీన్ మాత్రం సైలెంట్ గా ఉంటూ ఓపిక తో మంచి ప్రాజెక్ట్స్ కోసం వేచి చూడసాగింది, ఇప్పుడు తనని విమర్శించినా వాళ్ళందరి నోళ్లు మూయించే లా తమిళం లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకుంది. ధనుష్ హీరో గా త్వరలో రానున్న ఈ చిత్రం లో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ని చిత్ర వర్గాలు ట్విట్టర్ లో చేశారు.

ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం లో రానున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లో 39 వ చిత్రం. ధనుష్ కెరీర్ లో నే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకుంటున్నారట నిర్మాతలు. ఈ సినిమా లో మెహ్రీన్ పాత్ర కూడా చాలా కీలకం అని అందరూ అంటున్నారు. ఒక వైపు తమిళం లో సినిమాలు చేస్తూ తెలుగు లో కూడా అందివచ్చిన అవకాశాలని చేజార్చుకోకుండా ముందుకు సాగుతున్న మెహ్రీన్ ఈ సినిమా పూర్తి అయేలోపు ఒక పెద్ద ప్రాజెక్ట్ ని పెట్టాలనే ఆలోచన లో ఉన్నట్టు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -