Thursday, April 25, 2024
- Advertisement -

‘కేజీఎఫ్ 2’ లో ‘అధీరా’ లుక్.. భయపెడుతున్న సంజయ్..!

- Advertisement -

సినిమా పిచ్చి ఉన్న ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్ 2’ ఒకటని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగా ‘కేజీఎఫ్’ సంచలనం సృష్టించడంతో.. ఇప్పుడు ‘కేజీఎఫ్’ కి సీక్వెల్ వస్తున్న ‘కేజీఎఫ్ 2′ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్’ పాన్ ఇండియన్ చిత్రంగా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. వసూళ్ల పరంగా కూడా రికార్డు సృష్టించింది.

ఇప్పుడు ఈ సీక్వెల్ లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్.. రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో విలన్స్ ని మించి సెకండ్ పార్ట్ లో విలన్స్ ని చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ క్రమంలో నేడు సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన ‘అధీరా’ పాత్రకు సంభందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా ప్రశాంత్ నీల్ అధీరా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. ‘అధీరా’ – వైకింగ్స్ యొక్క క్రూరమైన మార్గాల నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో భాగమైనందుకు మీకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్ డే సంజయ్ బాబా. త్వరలో స్టార్ట్ అవబోయే మన క్రేజీ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాము అని ట్వీట్ చేసారు.

ఇక ఈ పోస్టర్ లో సంజయ్ దత్ ’అధీరా’ లుక్ లో చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ముఖం మీద టాటూ.. డిఫరెంట్ హెయిర్ స్టైల్.. చేతిలో పెద్ద కత్తి పట్టుకొని ఆలోచిస్తున్నట్లు కూర్చున్నారు. మొత్తం మీద ‘అధీరా’ పాత్రని ‘రాకీ భాయ్’ పాత్రకి ధీటుగా తీర్చిదిద్దారని ఫస్ట్ లుక్ లోనే తెలుస్తోంది. కేజీఎఫ్ మొదటి భాగంలో అధీరా ఎవరన్నది రివీల్ చేయలేదు. ఇక ఇక కేజీఎఫ్ 2 లో మాత్రం మెయిన్ విలన్ గా అధీరాను చూపిస్తున్నారు. కోలార్ ఫీల్డ్ గనుల నేపథ్యంలో మాఫియా కథతో తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని హెంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రవీ బాస్రుర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లో నితిన్, శాలిని సందడి..!

పరన్నజీవి మూవీ రివ్యూ..!

‘పవర్ స్టార్’ మూవీ రివ్యూ

నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్ కు హాజరయైన పవన్ కళ్యాణ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -