Saturday, April 20, 2024
- Advertisement -

పాజిటివ్ టాక్ తో రిలీజ్ అవుతున్న మిస్ మ్యాచ్

- Advertisement -

టాలెంటెడ్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ మూవీ మిస్ మ్యాచ్. ఇటీవలే వచ్చిన కౌసల్య కృష్ణ మూర్తి సినిమా తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు మిస్ మ్యాచ్ సినిమాతో మరో వైవిధ్యమైన పాత్ర పోషించింది. ఓ రెజ్లర్ గా ఐశ్వర్య కనిపించనుంది.

రెజ్లర్ గా ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ గా కనిపించడానికి మూడు నెలలు పాటు ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిసింది. విలేజ్ అమ్మాయికి తెలివైన అబ్బాయి కి మధ్య సాగె ప్రేమకథ గా ఈ సినిమాను డైరెక్టర్ నిర్మల్ కుమార్ తీర్చిదిద్దినట్లుగా చెబుతున్నారు.

ఇక ఈ సినిమాకి సంబందించిన ప్రివ్యూలు చూసినవారంతా సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటనకు, హీరో ఉదయ్ శంకర్ నటనకి ప్రసంసలు కురిపిస్తున్నారు. అలానే ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో నిర్మాతలు శ్రీరామ్, భరత్ ఎక్కడ రాజీపడలేదని, హృదయానికి హత్తుకునే రీతిన దర్శకుడు ఈ సినిమాని రూపొందించినట్లుగా చెబుతున్నారు. మరి ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో మిస్ మ్యాచ్ యే రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -