Saturday, April 20, 2024
- Advertisement -

రాజమౌళి సీక్రెట్ చెప్పిన కీరవాణి

- Advertisement -

లాక్ డౌన్ లో అంతా ఇంటి పట్టున కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. మన సినీ సెలెబ్రెటీలు కూడా అదే పనిచేస్తున్నారు. ఇంట్లో బట్టలు ఉతుకుతూ, బోల్లు తోముతూ ‘రియల్ మ్యాన్’ చాలెంజ్ లో పాల్గొంటున్నారు. అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ బృందం మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సహా కొమురం భీం ఎన్టీఆర్ టీజర్ కోసం తెగ కష్టపడుతోందట.. వీరంతా వర్క్ ఫ్రం చేస్తున్నారని తెలుస్తోంది. అనుకున్న టైంకు రిలీజ్ చేయాలని వీరంతా తపన పడుతున్నారట..

వీడియో కాల్స్ ద్వారా తాజాగా ఆర్ఆర్ఆర్ టీం టీవీ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇటీవల సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తన సోదరుడు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ఒక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రాజమౌళి ఏ పని ప్రారంభించినా దానిని ఖచ్చితంగా పూర్తి చేయాలన్న మొండి వైఖరిని ప్రదర్శిస్తాడని కీరవాణి తెలిపారు. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. రాజమౌళికి పిల్లల సినిమాలు చూడడం అస్సలు ఇష్టం ఉండదని.. ఎవరైనా పెడితే వేరొక రూములోకి వెళ్లి దాన్ని కొనసాగిస్తాడని కీరవాణి తాజాగా రాజమౌళి సీక్రెట్ ను బయటపెట్టారు.

రాజమౌళి చూడడానికి కొన్ని సినిమాలు కూడా సూచించానని.. అయితే తన సలహాను రాజమౌళి పాటించడు అని కీరవాణి చెప్పాడు. ఇటీవల ‘ఫారెస్ట్ గంప్’ అనే సినిమా చూడమని చెప్పినా రాజమౌళి చూడలేదని.. తాను అనుకున్నదే చేసే మొండి ఘటం అని తమ్ముడి ప్రవర్తన గురించి కీరవాణి చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సంగీతం అందించే ప్రోస్ట్ ప్రొడక్షన్స్ లో కీరవాణి బిజీగా ఉన్నాడు. ఆ క్రమంలో ఇంటర్వ్యూ ఇస్తూ రాజమౌళి సీక్రెట్ ను బయటపెట్టాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -