Friday, March 29, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..!

- Advertisement -

మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి అసలు పడదని అప్పట్లో రకరకల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందుకు తగ్గట్లుగానే సినీ పరిశ్రమ వజ్రోత్సవాలు సమయంలో మరియు చిరంజీవికి పద్మ భూషణ్ ఇచ్చిన సందర్భంగా ఆయన్ని సన్మానించిన వేడుకల్లో వీరి ఇరువురి మధ్య వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికి వీటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు.

అయితే ఇప్పుడు వీరు మంచి స్నేహితులుగా మెలుగుతున్నారు. ఇప్పుడు ఎన్నో వేడుకలకు కలిసి హాజరై ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటున్నారు. ఇటివలే మంచు మనోజ్ కొత్త మూవి ప్రారంభానికి రాం చరణ్ గెస్ట్ గా వెళ్ళిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరుకి స్వాగతం పలికిన మోహన్ బాబుకి ఫన్నీ వేలో ‘రాననుకున్నావా రాలేవనుకున్నావా’ అంటూ రిప్లై ఇచ్చి వాళ్ల మధ్య మంచి రిలేషన్ ఉందని మరోసారి స్పష్టం చేసారు. అయితే తాజాగా మంచు విష్ణు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సదరు యాంకర్ ప్రస్తావించారు.

అప్పట్లో పవన్ కళ్యాణ్ అలా ఎందుకు మాట్లాడారని అడుగగా ‘పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలియదని అనవసరంగా ఓవర్ రియాక్టయ్యాడని బహుశా ఆయన్ని అడిగితేనే దీనికి సమాధానం దొరుకుతుందని నాకు తెలిసి ఆ రోజు మా నాన్న గారు అంతగా ఏమి మాట్లాడలేదని వాళ్లిద్దరూ కొన్ని సంవత్సరాల నుండి కలిసి మెలిసి ఉంటున్నారని’ సమాధానమిచ్చాడు. అంతేకాకుండా ఈ స్థాయికి రావడానికి వాళ్లు ఎన్నో ఎదుర్కున్నారని.. ఈ జనరేషన్ హీరోలు కూడా చిరంజీవి మోహన్ బాబులని ఆదర్శంగా తీసుకోవాలని నేను ఈ జనరేషన్ హీరోలతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నానని తెలిపారు. ఇదిలా ఉండగా మంచు విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్లు’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -