చిరంజీవి సినిమాలో మోహన్ బాబు ఉన్నటా.. లేన్నటా..?

690
Mohan Babu not in Chiranjeevi and Koratala Siva Movie
Mohan Babu not in Chiranjeevi and Koratala Siva Movie

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. దసరాకు విడుదల కానుంది ఈ సినిమా. అయితే ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది.

తాజాగా ఈ విషయంపై సినిమా యూనిట్ సభ్యులు స్పందించారు. మోహన్ బాబు కి తగిన పాత్ర తమ సినిమాలో లేదనీ, అలాంటి పాత్రే గనుక వుంటే తప్పకుండా సంప్రదించేవారమని అన్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు నటించడం లేదని స్పష్టం చేశారు.

గతంలో చిరంజీవి – మోహన్ బాబు కలిసి నటించారు. మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరినీ ఒకే తెరపై చూడాలనుకునే అభిమానుల ఆశ .. నిరాశే అయింది. కథానాయికగా త్రిష నటిస్తున్న ఈ సినిమాలో రమ్ చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనుపించనున్నాడనే సంగతి తెలిసిందే.

Loading...