Wednesday, April 24, 2024
- Advertisement -

ఎస్వీఆర్ పాత్ర‌లో క‌లెక్షన్ కింగ్ మోహ‌న్‌బాబు..

- Advertisement -

మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా రూపొందుతున్న మూవీ మ‌హాన‌టి.. కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ మే 9వ తేదిన విడుద‌ల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలున్నాయ్‌. ఇక ఈ మూవీలో స‌ల్మాన్ దుల్క‌ర్, స‌మంత, మోహన్ బాబు, షాలిని పాండే, ప్రకాశ్ రాజ్, త‌రుణ్ భాస్క‌ర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా సినిమాలో న‌టిస్తున్న పాత్ర‌ల వివ‌రాల‌ను రోజు కొక‌టి చొప్పున విడుద‌ల చేస్తూ అభిమానుల్లో మ‌రింత ఆస‌క్తిని రేకేతిస్తున్నారు. ఈ సినిమాలో సుప్రసిద్ధ తెలుగు సినీ నటుడు, విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు పాత్ర ఉంది. అంత‌టి మ‌హాన‌టుడి పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు మెప్పించనున్నారు.

అలనాటి అందాల తార, గొప్ప నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. సినిమా ప్ర‌మోష‌న్స్ ఊపందుకుంది. సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ పోషించింది. దుల్కర్ సల్మాన్, నాగచైతన్య, సమంత, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించారు.

ఈ సినిమాలో ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్‌, కేవీ రెడ్డిగా దర్శకుడు క్రిష్‌ కనిపించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. హీరో నాని చేతుల మీదుగా వీడియోలను విడుదల చేయించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -