సూర్య తో గొడవకి దిగనున్న మోహన్ బాబు

86
Mohan Babu to Act in Surya's Next Movie
Mohan Babu to Act in Surya's Next Movie

విలక్షణ నటుడు మోహన్ బాబు తన కెరీర్ లో ఎన్నో పాత్రలని పోషించారు. హీరో గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, విలన్ గా.. ఇలా చాలా పాత్రలు పోషించి ప్రతి పాత్ర లో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శించారు. అయితే గత కొంత కాలం గా సినిమాలకి అయన దూరం గా ఉంటూ వస్తున్నారు. పైగా ఆయన తమిళం లో సినిమా చేసి చాలా ఏళ్ళే అవుతుంది. ఈ విషయం కొత్త ఏమి కాదు. అయితే ఇప్పుడు ఈయన తమిళ సినిమా పరిశ్రమ లో కి కంబాక్ చేయనున్నారు. అది కూడా సూర్య తదుపరి చిత్రం లో.

తెలుగు లో వెంకటేష్ తో గురు సినిమా తీసిన సుధా కొంగర దర్శకత్వం లో సూరారై పొట్రు అనే సినిమా ని చేస్తున్నారు దర్శకురాలు. ఎయిర్ డక్కన్ ఎయిర్లైన్స్ ఫౌండర్ కెప్టెన్ గోపినాథ్ పైన ఈ సినిమా తీయబడుతుంది. ఈ సినిమా లో ప్రతినాయకుడి పాత్ర కి కావాలనే మోహన్ బాబు ని తీసుకున్నారట. మోహన్ బాబు అయితే పర్ఫెక్ట్ గా వారు అనుకున్న పాత్ర కి సూట్ అవుతారని ఆయన ని తీసుకున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

సూర్య ఈ సినిమా కి నిర్మాత. నేడు మొదలు కానున్న షెడ్యూల్ లో పాల్గొనడానికి మోహన్ బాబు ఆల్రెడీ చెన్నై చేరుకున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.