Thursday, April 18, 2024
- Advertisement -

దుల్కర్ కొంప‌ముంచిన హీరోయిన్‌

- Advertisement -

స‌రదాగా తీసుకున్న కొన్ని వీడియోలు త‌రువాత తీవ్ర ప్ర‌భావం చూపుతాయి.ఇలా స‌రదాగా తీసుకున్న వీడియోలు ద్వారా త‌మ జీవితాలు కూడా కొల్పోయిన వారు చాలామంది ఉన్నారు.ఇలాంటి వీడియోలు విష‌యంలో సెల‌బ్రిటీలు అయితే ట్రోల్స్ ఫేస్ చేస్తుంటారు.తాజాగా ఇటువంటి సంఘ‌ట‌నే హీరో దుల్కర్ సల్మాన్‌కు ఎదురైంది.ఓ సినిమా షూటింగ్‌లో స‌రాద‌గా తీసుకున్న వీడియో ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే… దుల్కర్ సల్మాన్ బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా సోన‌మ్ క‌పూర్ న‌టిస్తుంది.షూటింగ్‌లో భాగంగా స‌ల్మాన్ కారు న‌డుపుతు త‌న మొబైల్ చెక్ చేసుకుంటుంన్న వీడియోను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ పోస్ట్ చేసింది సోన‌మ్‌.అంతే నెటిజ‌న్లు దుల్కర్ సల్మాన్‌పై ట్రోల్స్ చేయ‌డం మొదలు పెట్టారు.

చాలా మంది నెటిజన్లు కూడా దుల్కర్ పై మండిపడ్డారు. ఇలాంటి పోజులు సినిమాల్లో చూపించుకో రోడ్ మీద కాదు అంటూ అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.దీనిపై ముంబై పోలీసులు కూడా స్పందించారు. ఇలాంటి పనులు మానుకోవాలని మీ ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ విష‌యం మాట్లాడిన దుల్కర్ సల్మాన్ ఆ స‌మ‌యంలో నేను కారు న‌డ‌ప‌డం లేద‌ని,, ఓ భారీ ట్రక్కు తన కారుని లాగుతోందని క్లారిటీ ఇచ్చాడు. ‘ది జోయా ఫ్యాక్టర్’ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు తెలిపాడు. ఆ సమయంలో తనకు అసలు కారు మీద కంట్రోల్ లేదని, కారు స్టార్ట్ కూడా చేయలేదని చెప్పాడు.మొత్త‌నికి స‌రదాగా తీసిన వీడియో ఎంత ప‌ని చేసిందో చూశారా.

https://www.youtube.com/watch?v=WsHNclYJjy0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -