‘మర్డర్’ ట్రైలర్.. కళ్ళ కట్టినట్టు చూపించిన వర్మ..!

772
Murder Trailer Talk
Murder Trailer Talk

రామ్ గోపాల్ వర్మ అంటనే కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్. ఆయన వాస్తవ సంఘటనలకు ఆధారంగా సినిమాలు తీస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో ‘మర్డర్’ అనే సినిమా తీస్తున్నానని.. ఇది ‘కుటుంబ కథా చిత్రమ్’ అని పేర్కొన్నారు వర్మ.

తాజాగా ఈ చిత్రానికి సంభందించిన ట్రైలర్ రిలీజ్ చేసారు. అగ్ర కులానికి చెందిన అమ్మాయి కులాంతర వివాహం చేసుకున్న తదనంతర పరిస్థితులను ఈ చిత్రంలో వర్మ చూపిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కూతురిపై ప్రేమ – సమాజంలో పరువు గురించి ఆలోచిస్తూ వాటి మధ్య నలిగిపోయిన తండ్రి మానసిక వేదనే ఈ మూవీ కనిపిస్తోంది. ”పిల్లల్ని ప్రేమించడం తప్పా?.. తప్పు చేస్తే దండించడం తప్పా?.. వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా?.. పిల్లల్ని కనగలం గాని వారి మనస్తత్వాలను కనగలమా? సమాధానం మీరే చెప్పండి” అనే ప్రశ్నలను సందిస్తున్నాడు.

“మర్డర్” సినిమా ఏ ఇన్సిడెంట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారో వర్మ వెల్లడించనప్పటికీ రెండేళ్ల క్రితం తెలంగాణాలో చోటు చేసుకున్న దుర్ఘటన ఆధారంగా రూపొందిన సినిమా అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మిర్యాలగూడకు చెందిన కూతురు అమృత.. ప్రణయ్ అనే వ్యక్తిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవడం వల్ల తన పరువు పోయిందని అల్లుడిని దారుణంగా హత్య చేయించిన విషయం తెలిసిందే. అయితే మారుతీరావు కూడా ఆ మధ్య ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

ఇప్పుడు ఇదే కథా వస్తువు అయింది. ఇప్పటికే వివాదాస్పద చిత్రాలు తెరకెక్కించే డైరెక్టర్ అనే పేరున్న వర్మ మరో వివాదానికి తెరలేపాడని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. కాగా ‘మర్డర్’ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు క్విటీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. శ్రీకాంత్ అయ్యంగార్ – సాహితి – భార్గవి ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలో ఈ చిత్రం ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ఘనంగా నితిన్, శాలిని పెళ్లి..!

నితిన్ పెళ్లి కానుకగా ‘రంగ్ దే’ దృశ్య మాలిక

ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లో నితిన్, శాలిని సందడి..!

‘పవర్ స్టార్’ మూవీ రివ్యూ

Loading...