అల్లరి నరేష్ ‘నాంది’ టీజర్ టాక్

423
naandhi movie teaser review
naandhi movie teaser review

అల్లరి నరేష్.. ఎన్నో కామెడీ సినిమాల్లో నటించింది చిన్న నిర్మాతలకు.. కామెడీ ప్రేక్షకులకు వరం అయ్యాడు. నరేష్ సినిమాలతో కడుపుబ్బా నవ్వుకోవచ్చు అనే గుర్తుంపు తెచ్చుకున్నాడు. అయితే కామెడీ సినిమాలతో పాటు కాస్త సీరియస్ నెస్ ఉన్న సినిమాలు కూడా ఈ మధ్య చేస్తున్నాడు నరేష్. ఈ రోజు నరేష్ పుట్టిన రోజు.

ఈ సందర్భంగా ఆయన తాజాగా నటించిన నాంది సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఒకటిన్నర నిమిషం ఉన్న ఈ టీజర్ సీరియస్ నోట్ లో సాగింది. విచారణలో ఉన్న ముద్దాయిగా అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు. తన కేసు తీర్పు కోసం ఎదురుచూసే అండర్ గోయింగ్ ఖైదీగా అల్లరి నరేష్ పాత్ర కనిపిస్తోంది. ఇక ఖైదీల పట్ల పోలీసుల చిత్ర హింసలు, న్యాయవ్యవస్థలో లోపాలు వంటి విషయాలు ఈ మూవీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏళ్ల తరబడి కోర్ట్ తీర్పు కోసం ఎదురుచూసే…ముద్దాయిగా , జైలు గోడల మధ్య చిత్ర హింసలకు గురయ్యే ఖైదీగా నరేష్ సీరియస్ గా నటించారు. ఇక తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ అల్లరి నరేష్ కోసం న్యాయపోరాటం చేసే లాయర్ గా నటించినట్లు తెలుస్తోంది. కమెడియన్ ప్రియదర్శి కూడా జైలులో ఖైదీగా కనిపించాడు. మొత్తంగా నాంది మూవీ న్యాయ వ్యవస్థలలోని లోపాలు, ఖైదీల పట్ల పోలీసుల అమానుష ప్రవర్తన వంటి అనేక సామాజిక కోణాలను లోతుగా నాంది మూవీలో చర్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నరేష్ కెరీర్ లో మంచి చిత్రంగా అయ్యేలా ఉంది. ఈ చిత్రాన్ని విజయ్ కనకమేడల తెరకెక్కిస్తుండగా.. సతీష్ వేగేశ్న నిర్మించారు. మీరు కూడా ఆ టీజర్ ని చూసేయండి.

అందాలు చూపిస్తూ యోగా చేస్తున్న విష్ణు ప్రియా (వీడియో)

దొరబాబు సెక్స్ రాకెట్.. మళ్లీ బయటపెట్టిన హైపర్ ఆది..!

సునీల్ గారు ఎక్కిన రిక్షాని లాక్కొచ్చాను : హైపర్ ఆది

గంగోత్రి హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

Loading...