Friday, April 19, 2024
- Advertisement -

నాని సినిమాకి కొత్త రిలీజ్ డేట్

- Advertisement -

‘జెర్సీ’ సినిమా తో మంచి విజయాన్ని సాధించిన నాచురల్ స్టార్ నాని ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ అనే ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లక్ష్మి మరియు శరణ్య పొంవణ్ణన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. నిజానికి ఈ సినిమాని ముందుగా ఆగస్టు 30న విడుదల చేయాలని అనుకున్నారు కానీ ‘సాహో’ కూడా అదే రోజుకి వాయిదా పడటంతో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కూడా వాయిదా వేయాల్సి వచ్చింది.

తాజాగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కి కొత్త విడుదల తేదీని ప్రకటించారు దర్శకనిర్మాతలు. ‘గ్యాంగ్ లీడర్’ సెప్టెంబర్ 13న విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. విడుదలకు ఇంకా సమయం ఉండటంతో ప్రమోషన్ పనులు మరి కొన్ని వారాల్లో మొదలు పెట్టనున్నారు దర్శకనిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. ‘జెర్సీ’ సినిమాకి సంగీతాన్ని అందించిన అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో నాని మరొక హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -