Thursday, March 28, 2024
- Advertisement -

ఎన్టీఆర్ రికార్డ్ బద్దలు.. బిగ్ బాస్ నాగార్జున సంచలనం

- Advertisement -

బిగ్ బాస్ సందడి చేస్తోంది. ఇప్పుడు నాగార్జున షోను పీక్ స్టేజ్ కు తీసుకెళుతున్నారు. గత సీజన్ లకు భిన్నంగా ఈసారి సెలబ్రెటీలు హౌస్ లో ఉండడంతో కాసింత వినోదం ప్రేక్షకులకు అందుతోంది. అయితే తాజాగా బిగ్ బాస్ రికార్డుల బద్దలు కొడుతోందట..

బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ లను బట్టి ఎన్టీఆర్, నాని బిగ్ బాస్ ల కంటే నాగార్జున బిగ్ బాస్ అన్నింటికంటే టీఆర్పీ రేటింగ్ లలో దూసుకుపోతోందని తాజా లెక్కలు చెబుతున్నాయి.

ఎన్టీఆర్ హోస్ట్ గా సాగిన బిగ్ బాస్ 1 ఎవ్వరూ ఊహించని స్థాయిలో హిట్ అయ్యింది. ఎన్టీఆర్ ఆల్ రౌండ్ షోతో ఆ షో అత్యధికంగా 16.1 రేటింగ్ సాధించింది. ఇప్పటికీ తారక్ ది బెస్ట్ హోస్ట్ అన్నవారు ఉన్నారు.

ఇక రెండోసీజన్ లో నాని హోస్ట్ గా కూడా అదే ఉత్సుకథ నెలకొంది. ఈ రెండోసీజన్ లో అత్యధికంగా 15.5 రేటింగ్ సాధించింది. తారక్ తో పోలిస్తే కాసింత తక్కువైనా నాని నేచురల్ హోస్టింగ్ తో వార్తల్లో నిలిచారు.

తాజాగా మూడో ఏడాది నాగార్జున చేపట్టాడు. సీనియర్ హీరో కావడం.. అంతే జోష్ తో ఈ షో నడిపిస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3 టీఆర్పీ రేటింగ్స్ తాజాగా వచ్చాయి. ఏకంగా 17.9 రేటింగ్ సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పటివరకు బిగ్ బాస్ ఎన్టీఆర్ నిర్వహించిన మొదటి సీజన్ కు 16.1 రేటింగే అత్యధికం. ఇప్పుడు ఎన్టీఆర్ ను తోసిరాజని నాగార్జున రికార్డు సృష్టించడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -