Thursday, March 28, 2024
- Advertisement -

సాయి పల్లవితో రెండో సినిమా… గోల్డెన్ లెగ్ అనుకుంట

- Advertisement -

శేఖర్ కమ్ముల సినిమా అంటేనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అలా అని కేవలం రోమాన్స్ ఉండదు కుటుంబకథాచిత్రంగా ఉంటుంది. కుటుంబ విలువలతో, అసభ్య సన్నివేశాలకు దూరంగా మనసుకు హద్దుకునే చిత్రం నిర్మించడంలో శేఖర్ కమ్ములకు సాటి మరెవరూలేరు. లైప్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా లాంటి సినిమాలు చూస్తే ఆయనకు ఫ్యాన్ అవ్వకుండా ఉండలేము.

ఒకే ఫంథాలో నడుస్తున్న తెలుగు సినిమాను తన కథలతో మైమరిపించిన దర్శకుడు శేఖర్ కమ్ముల. కొత్త వారిని ఇండస్ర్టీకి పరిచయం చేస్తారు, లేకపోతే ఉన్నవారినే కొత్తకోణంలో పరిచయం చేస్తారు. అలానే మనం సాయి పల్లవిని ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో చూసాం. ఇప్పుడు సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రెండో సినిమా చేస్తుంది.

నాగచైతన్య హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ యాసలో నటించబోతున్నాడు అంట. సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడిన ఫిదా సినిమా ఎంత గొప్ప హిట్ అయ్యిందో మన అందరికీ తెలుసు, సో ఇప్పుడు చైతుతో శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ ప్రయోగం ఎంత పెద్ద హిట్ సాధిస్తుందో మనం వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -