Saturday, April 20, 2024
- Advertisement -

రాజశేఖర్ దర్శకుడి తో నాగ చైతన్య

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన తదుపరి సినిమా వెంకీ మామ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. మజిలీ విజయం తరువాత నాగ చైతన్య ఆనందానికి అవదులు లేకుండా పోయింది. వరుసగా సినిమాలు సైన్ చేయడం మొదలు పెట్టాడు. ఇదే ఊపు లో మేర్లపాక గాంధీతో ఒక సినిమా ని కమిట్ అయిన నాగ చైతన్య ఇప్పుడు ఆ! సినిమా తో అరంగేట్రం చేసిన ప్రశాంత్ వర్మ తో ఒక సినిమా చేయనున్నాడు అట.

కల్కి సినిమా కి వచ్చిన పాజిటివ్ బజ్ నచ్చి ప్రశాంత్ వర్మ చెప్పిన కథ కూడా మెప్పించడం తో వెంటనే నాగ చైతన్య ప్రశాంత్ వర్మ కి డేట్స్ ఇచ్చాడట. అయితే ఈ కథ ని ప్రశాంత్ వర్మ ముందుగా నాని కి వినిపించగా నాని ఎందుకో ఈ కథ ని చేయటానికి ఇష్ట పడలేదు. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి ఈ కథ నాగ చైతన్య ముందుకు వచ్చింది.

ఈ ఏడాది చివరన ఈ సినిమా ని పట్టాలు ఎక్కించే ప్రయత్నం లో ఉన్నాడు నాగ చైతన్య. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మించాలనే ప్లాన్ జరుగుతుంది. మరిన్ని వివరాలు త్వరలో అధికారికం గా వెల్లడవనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -