Thursday, April 18, 2024
- Advertisement -

తెలంగాణ యాస నేర్చుకుంటున్న అక్కినేని హీరో

- Advertisement -

ప్రస్తుతం వెంకటేష్ దగ్గుబాటి తో వెంకీ మామ సినిమా లో నటిస్తున్న నాగ చైతన్య అక్కినేని ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఒక కొత్త చిత్రం లో నటించనున్నాడు. నాగ చైతన్య ఎప్పటి నుంచో శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నటించాలి అనే తన కోరికని మొత్తానికి తీర్చుకుంటున్నాడు. ఈ సినిమా లో చైతు పక్కన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమా డాన్స్ నేపథ్యం గా సాగుతుందట. సాయి పల్లవి ఈ సినిమా లో డాన్సర్ గా నటించనుంది. అలాగే ఫిదా తరహా లో నే ఈ సినిమా కూడా తెలంగాణ ప్రాంతం లో చేయబడుతున్న కారణం గా సినిమా లో నటీనటులు తెలంగాణ యాస లో మాట్లాడనున్నారు అని తెలుస్తుంది.

అందుకు గానూ ప్రస్తుతం నాగ చైతన్య తెలంగాణ యాస మీద పట్టు సాదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యాస మంచిగా మాట్లాడేందుకు ట్రైనింగ్ కూడా తీసుకోవాలని చైతు భావిస్తున్నాడట. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే సమయానికి ఎంతో కొంత యాస మీద పట్టు సాధించి అందరినీ మెప్పించాలని చైతు భావిస్తున్నాడట. ఈ సినిమా లో తన పాత్ర కూడా ఇంత వరకు తాను చేసిన వాటన్నిటికన్నా భిన్నం గా ఉండబోతుంది అని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -