Saturday, April 20, 2024
- Advertisement -

నాగ శౌర్య కొత్త సినిమా.. దర్శకురాలు డెబ్యూ

- Advertisement -

హీరో నాగ శౌర్య ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అంతే కాకుండా మరొక సినిమా ని కూడా ఆయన ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సారి ఈ కొత్త సినిమా ని ఒక నూతన దర్శకురాలు లక్ష్మి సౌజన్య చేయనున్నారు. ఈ సినిమా తో లక్ష్మి దర్శకురాలిగా అరంగేట్రం చేస్తున్నట్లు తెలుస్తుంది. సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ మీద నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక పోతే ఈ సినిమా ని నిర్మాతలు అక్టోబర్ నెలలో మొదలు పెట్టనున్నారు.ఈ బ్యానర్ నుంచి వచ్చే ఎనిమదవ సినిమా ఇది. ఈ సినిమా కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తుంది. హీరో శౌర్య కాగా, ఈ సినిమా లో హీరోయిన్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల గురించి ఇంకా ఒక క్లారిటీ లేదు.

ఇటీవలే ఓ బేబీ సినిమా లో మంచి పాత్ర పోషించి విజయం అందుకున్న శౌర్య ఇలా ఒక ఫిమేల్ దర్శకురాలి అవకాశం ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -