Thursday, April 25, 2024
- Advertisement -

నేను మెగా ఫ్యామిలీ కి అల్లుడు కావడం లేదు

- Advertisement -

నాగ శౌర్య పేరెంట్స్ సొంతంగా నిర్మాణం స్టార్ట్ చేసి చలో అనే సినిమా ని నిర్మించారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధి గా విచ్చేసిన దగ్గర నుండి మెగా స్టార్ చిరంజీవి శౌర్య ని అల్లుడు చేసుకోబోతున్నారు అనే వార్తలు ఎక్కువ అయ్యాయి. ఒక మనసు సినిమా లో నిహారిక పక్కన నటించిన కానీ శౌర్య మీద అప్పట్లో ఈ పుకార్లు లేవు. ఎందుకో సడన్ గా వీరు రిలేషన్ లో ఉన్నారు అనే రూమర్స్ మొదలు అయ్యాయి. అయితే అటు శౌర్య ఇటు నిహారిక ఇద్దరూ తమకి కుదిరినప్పుడల్లా తరిలేషన్ లో ఉన్నదీ నిజం కాదని, ఒకళ్ళనొకళ్ళు పెళ్ళి చేసుకోవడం లేదు అని వివరణ ఇచ్చారు.

అయితే ఈ విషయం మీద శౌర్య ఇంకోసారి స్పందించాడు. “ఇదే ఆఖరి సారి నేను క్లారిటీ ఇవ్వడం. నా ఫ్రెండ్స్ కొంత మంది అడుగుతుంటే కూడా నాకు చాలా అసౌకర్యం గా అనిపించింది. అసలు నేను నిహారిక ని పెళ్ళి చేసుకోవడం లేదు. మేము ఇద్దరం డేటింగ్ చేయడం లేదు. అసలు నేను ఏ హీరోయిన్ తో నూ డేటింగ్ లో లేను.” అని చెప్పాడు.

ప్రస్తుతం నాగ శౌర్య అశ్వద్ధామ అనే సినిమా తో బిజీ గా ఉన్నాడు. రమణ తేజ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా ని శౌర్య తల్లిదండ్రులు తమ సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బానర్ పైన నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -